e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, August 5, 2021
Home హైదరాబాద్‌ ఆరోగ్య తెలంగాణ దిశగా ప్రభుత్వం అడుగులు

ఆరోగ్య తెలంగాణ దిశగా ప్రభుత్వం అడుగులు

ఆరోగ్య తెలంగాణ దిశగా ప్రభుత్వం అడుగులు
  • కరోనా కట్టడిలో ప్రభుత్వం సఫలం
  • ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో పేదలకు ఎంతో మేలు
  • ఆర్కేపురం ప్రైమరీ హెల్త్‌ సెంటర్‌ ప్రారంభోత్సవంలో మంత్రి సబితారెడ్డి

ఆర్కేపురం, జూలై 24: ఆరోగ్య తెలంగాణ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఆర్కేపురం డివిజన్‌ పార్క్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన అర్బన్‌ ప్రైమరీ హెల్త్‌ సెంటర్‌, సౌభాగ్యపురం కాలనీలో రూ.84 లక్షలతో సీసీ రోడ్డు పనులను గురువారం మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్సీలు ఎగ్గే మల్లేశం, బొగ్గారపు దయానంద్‌, రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్‌ ఆయాచితం శ్రీధర్‌, జిల్లా వైధ్యాధికారిణి స్వరాజ్యలక్ష్మి, స్థానిక కార్పొరేటర్‌ రాధాధీరజ్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరోనా కట్టడిలో ప్రభుత్వం సలఫలమైందని తెలిపారు. పేదలకు మంచి వైద్యం అందించాలన్న సంకల్పంతో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించామని చెప్పారు. త్వరలోనే గడ్డి అన్నారం వ్యవసాయ పండ్ల మార్కెట్‌ స్థలంలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ రాబోతుందన్నారు.

కార్యక్రమంలో డీసీ కృష్ణయ్య, ఆర్కేపురం డివిజన్‌ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు మురుకుంట్ల అరవింద్‌, నాయకులు నెంటూరి రవీందర్‌రెడ్డి, జిల్లాల కృష్ణారెడ్డి, ఖిల్లా మైసమ్మ ఆలయ చైర్మన్‌ గొడుగు శ్రీనివాస్‌, ప్రసన్నాంజనేయ స్వామి ఆలయ చైర్మన్‌ జగిని రమేష్‌, మారోజు రామాచారి, పగిళ్ళ భూపాల్‌రెడ్డి, కొండ్ర శ్రీనివాస్‌, శ్రీ ప్రంత్యాగిరా దేవాలయ కార్యదర్శి మునిపల్లె శ్రీనివాస్‌, కాలనీ అసోసియేషన్‌ సభ్యులు రామారావు, సాయి కుమార్‌, రమేశ్‌బాబు, రామ్మోహన్‌రావు, హరీశ్‌, శ్యామ్‌సుందర్‌, నాయకులు కొండ్ర శ్రీనివాస్‌, శ్రీనివాస్‌రెడ్డి, పెంబర్తి శ్రీనివాస్‌, రమేశ్‌కుర్మ, కంచర్ల శేఖర్‌, రాజుశ్రీవాస్తవ, పటేల్‌ సునీతారెడ్డి, ఊర్మిలారెడ్డి, మారం సుజాతారెడ్డి, పిట్ట ఉపేందర్‌రెడ్డి, దుబ్బాక శేఖర్‌, పరీద్‌ పాషా పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఆరోగ్య తెలంగాణ దిశగా ప్రభుత్వం అడుగులు
ఆరోగ్య తెలంగాణ దిశగా ప్రభుత్వం అడుగులు
ఆరోగ్య తెలంగాణ దిశగా ప్రభుత్వం అడుగులు

ట్రెండింగ్‌

Advertisement