e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, October 19, 2021
Home హైదరాబాద్‌ గ్రామాల అభివృద్ధికి కృషిచేస్తా: మంత్రి

గ్రామాల అభివృద్ధికి కృషిచేస్తా: మంత్రి

మహేశ్వరం, అక్టోబర్‌ 13: గ్రామాల అభివృద్ధికి కృషిచేస్తానని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం తుమ్ములూరు సర్పంచ్‌ మద్దిసురేఖ ఆధ్వర్యంలో తుమ్ములూరు గేట్‌ నుంచి తుమ్ములూరు వరకు అధ్వానంగా ఉన్న రోడ్డును నిర్మించాలని గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులతో మంత్రికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో సంక్షేమ రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అన్నారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాతనే గ్రామాల్లో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని గుర్తు చేశారు. తుమ్ములూరు గ్రామానికి రోడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ కటికెల శ్రీహరి వార్డు సభ్యులు సురేందర్‌రెడ్డి, మద్ది శ్రీధర్‌రెడ్డి, చంద్రయ్య నాయకులు శ్రీనువాస్‌, నర్సిరెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, రాజు, దర్శన్‌గౌడ్‌, విద్యాసాగర్‌రెడ్డి, జంగయ్య, పర్వతాలు, దుర్గాప్రసాద్‌, శేఖర్‌, సుభాష్‌, రమేశ్‌, మహేశ్‌, లింగారెడ్డి, సురేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement