e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, April 14, 2021
Advertisement
Home హైదరాబాద్‌ వరద కాల్వలకు రూ.94.41 కోట్లు

వరద కాల్వలకు రూ.94.41 కోట్లు

వరద కాల్వలకు  రూ.94.41 కోట్లు

బడంగ్‌పేట,ఏప్రిల్‌6: బాలాపూర్‌ మండల పరిధిలోని మీర్‌పేట, బడంగ్‌పేట కార్పొరేషన్లతో పాటు జల్‌పల్లి మున్సిపల్‌లో వరద కాల్వలను నిర్మించడానికి రూ.9 4.41 కోట్లు మంజూరు చేసినట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ భవిష్యత్‌లో ముంపు సమస్య పునరావృతం కాకుండా ఉండటానికి ప్రభుత్వం ప్రణాళిక బద్ధంగా పనిచేస్తుందని అన్నారు. మహేశ్వరం నియోజక వర్గం పరిధిలోని బాలాపూర్‌ మండల పరిధిలోని మీర్‌పేట, బడంగ్‌పేట కార్పొరేషన్లతో పాటు జల్‌పల్లి మున్సిపల్‌ పరిధిలో ముంపు సమస్య లేకుండా చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.

వరద ముంపు నుంచి పట్టణ ప్రజలను కాపాడాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్‌ నీటి కాల్వల నిర్మాణానికి త్వరలో నిధులు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. వరద నీరు సాఫీగా పోవడానికి శాశ్వత పరిష్కారం కోసం ప్రతిపాదనలు చేసినట్లు పేర్కొన్నారు. మున్సిపల్‌ శాఖ మంత్రి తారక రామారావు పట్టణాల అభివృద్ధి కోసం ఆహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దడంతో పాటు మున్సిపల్‌ కార్పొరేషన్‌, మున్సిపాలిటీల సమగ్ర అభివృద్ధి కార్యాచరణతో ముందుకు పోతున్నట్లు తెలిపారు.

వరద ముంపునకు గురవుతున్న కాలనీలను గుర్తించి ప్రతి పాదనలు సిద్ధం చేసినట్లు తెలిపారు. చెరువులను అనుసంధానం చేస్తూ వరద కాల్వలను నిర్మాణం చేయాలని చెప్పామన్నారు. వరద కాల్వల నిర్మాణ పనులు పూర్తి అయితే భవిష్యత్‌లో బాలాపూర్‌ మండలానికి వర ద ముంపు సమస్య ఉండదన్నారు. సీఎం సూచనల మేరకు ప్రతి పాదనలు చేశామన్నారు. ముంపు సమస్య నుంచి బయట పడవేయడానికి ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటుందన్నారు. వరద కాల్వల పనులు త్వరలోనే మొదలు పెడుతామన్నారు.

నిధుల వివరాలు..

మీర్‌పేట కార్పొరేషన్‌ పరిధిలోని ఇండో అమెరికన్‌ స్కూల్‌ నుంచి మంత్రాల చెరువుకు రూ.5.33 కోట్లు, పెద్ద చెరువు నుంచి మంత్రాల చెరువు వరకు రూ.6.5 6కోట్లు, మంత్రాల చెరువు నుంచి జిల్లెలగూడ చందన చెరువు వరకు రూ.6.30 కోట్లు, టీచర్‌ కాలనీ రోడ్‌ నంబర్‌ 115నుంచి గాయిత్రీ నగర్‌ నంది హిల్స్‌ , టీకేఆర్‌ సౌత్‌ గేట్‌ వరకు రూ.27.43కోట్లతో ట్రంక్‌ లైన్‌ నిర్మాణం కోసం ప్రతి పాదనలు పంపినట్లు తెలిపారు. అతి త్వరలోనే ని ధులు మంజూరు చేయనున్నట్లు తెలపారు. బడంగ్‌పేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని కోమటి కుంట నుంచి మీర్‌పేట వరకు రూ.9.66కోట్లు, పోచమ్మ కుంట నుంచి మీర్‌పేట త లాబ్‌ వరకు రూ.14.8కోట్లతో వరద నీటి కాల్వలు నిర్మాణం చేయనున్నట్లు మంత్రి తెలిపారు.

జల్‌పల్లి మున్సిపల్‌ పరిధిలోని మామిడిపల్లి నుంచి ఉమ్దా సాగర్‌ వరకు రూ.14.19 కోట్లు, కోతమ్మ కుంట నుంచి గుర్రం చెరువు వరకు 10.66కోట్లతో వరద నీరు సాఫీగా వెళ్లడానికి డ్రైన్‌ నిర్మాణం పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. వరద నీటి కాల్వలను నిర్మాణం పెద్ద చెరువు, మంత్రాల చెరువు, సందచెరువులకు అనుసంధానం చేయనున్నట్లు తెలిపారు. కార్పొరేషన్‌లోని పలు లోతటు ప్రాంతాల్లో ఉన్న కాలనీలు ముంపునకు గురి కాకుండా శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలోజరిగిన నష్టం జరగ కుండా ఉండటానికే వరద కాల్వలను నిర్మాణం చేయనున్నట్లు తెలిపారు. ముఖ్య మంత్రి కేసీఆర్‌, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ నిధులు కేటాయించినందుకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement
వరద కాల్వలకు  రూ.94.41 కోట్లు

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement