శనివారం 23 జనవరి 2021
Hyderabad - Nov 22, 2020 , 07:31:33

సుపరిపాలనను ఆదరించాలి: రవాణాశాఖమంత్రి పువ్వాడ అజయ్

సుపరిపాలనను ఆదరించాలి: రవాణాశాఖమంత్రి పువ్వాడ అజయ్

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ఆరేండ్ల కాలంలో నగరంలో జరిగిన అభివృద్ధిని చూడాలని, పనిచేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని రవాణాశాఖమంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. శనివారం కేపీహెచ్‌బీ కాలనీ డివిజన్‌ ఇందూ విల్లాస్‌ అపార్ట్‌మెంట్స్‌ వద్ద టీఆర్‌ఎస్‌ ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్న టీఆర్‌ఎస్‌ పార్టీని ఆదరించాలని, గ్రేటర్‌ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేయాలని కోరారు. స్థానికంగా సమస్యలను పరిష్కరించడంలో ఎమ్మెల్యే కృష్ణారావు, కార్పొరేటర్‌ శ్రీనివాస్‌రావు చేసిన కృషిని ఆశీర్వదించాలని విజ్ఞప్తిచేశారు. టీఆర్‌ఎస్‌ గెలిస్తేనే నగరం ప్రశాంతంగా ఉంటుందని తద్వారా హైదరాబాద్‌ విశ్వనగరంగా మారి వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో డివిజన్‌ అధ్యక్షుడు సాయిబాబా చౌదరి, సురేశ్‌రెడ్డి, శ్యామలరాజు, పిడికిటి గోపాల్‌, అపార్ట్‌మెంట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు అనంతరెడ్డి, ప్రధాన కార్యదర్శి శేషారెడ్డి, కార్యవర్గ సభ్యులు, కాలనీవాసులు పాల్గొన్నారు.


logo