e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, October 21, 2021
Home హైదరాబాద్‌ పాఠ్యాంశంగా ఐలమ్మ జీవిత చరిత్ర

పాఠ్యాంశంగా ఐలమ్మ జీవిత చరిత్ర

సికింద్రాబాద్‌, సెప్టెంబర్‌ 26 : తెలంగాణ బహుజన వర్గాల స్ఫూర్తి ప్రదాత చాకలి ఐలమ్మ అని రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. ఆదివారం కంటోన్మెంట్‌ మడ్‌ఫోర్ట్‌ దోబీఘాట్‌లో నిర్వహించిన చాకలి ఐలమ్మ 126వ జయంతి కార్యక్రమానికి మంత్రులు శ్రీనివాస్‌గౌడ్‌, చామకూర మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే సాయన్న, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్‌రెడ్డి హాజరై ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ ఐలమ్మ జయంతి, వర్ధంతి కార్యక్రమాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నదని తెలిపారు. రజకుల కోసం కార్పొరేషన్‌ ఏర్పాటు చేసినట్లు గుర్తుచేశారు. హైదరాబాద్‌లో 3 ఎకరాల విస్తీర్ణంలో రూ. 5 కోట్ల వ్యయంతో స్మారక భవనం నిర్మిస్తుందని, 5వ తరగతిలో ఐలమ్మ జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చి ఆమెకు సముచిత గుర్తింపు, గౌరవాన్ని తెలంగాణ ప్రభుత్వం కల్పించిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ బుర్ర వెంకటేశం, బీసీ రజక ఫెడరేషన్‌ ఎండీ చంద్రశేఖర్‌, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు గజ్జెల నగేశ్‌, రజక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మాచర్ల ఉప్పలయ్య, రజక సంఘం యూత్‌ అధ్యక్షుడు నల్ల తీగల రాజు, కో-కన్వీనర్‌ కోట్ల శ్రీనివాస్‌, మడ్‌ఫోర్ట్‌ రజక సంఘం ప్రతినిధులు శంకర్‌, పరశురామ్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement