e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 13, 2021
Home News మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌తో.. 21మంది పిల్లలు సేఫ్‌

మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌తో.. 21మంది పిల్లలు సేఫ్‌

మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌తో.. 21మంది పిల్లలు సేఫ్‌
  • పీర్‌ చిల్డ్రన్స్‌ హోంను సందర్శించిన అధికారులు
  • ఎలాంటి అనుమతులు, వసతులు లేకపోవడంతో హోం రద్దు

చర్లపల్లి, మే 20 : ఓ చిల్డ్రన్స్‌ హోం నిర్వాహకుడు చేసిన ట్వీట్‌కు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ వెంటనే స్పందించారు. జిల్లా అధికారులకు మంత్రి ట్వీట్‌ చేయడంతో వెంటనే సంబంధిత హోంను సందర్శించడంతో హోం బాగోతం భయటపడింది. వివరాల్లోకి వెళితే.. కుషాయిగూడ పరిధి శుభోదయ కాలనీలోని పీర్‌ చిల్డ్రన్స్‌ హోం నిర్వాహకుడు తమ హోంలో సౌకర్యాలు కల్పించాలని, ప్రభుత్వ పథకాలు అందించాలని కోరుతూ.. మంత్రి కేటీఆర్‌కు ట్వీట్‌ చేశాడు. వెంటనే స్పందించిన మంత్రి కేటీఆర్‌ మేడ్చల్‌ జిల్లా అధికారులకు ట్వీట్‌ ద్వారా సమాచారం అందించారు. దీంతో గురువారం చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ చైర్మన్‌ రాజారెడ్డి, స్థానిక కార్పొరేటర్‌ బొంతు శ్రీదేవి, డీడబ్ల్యూఓ అధికారులు పీర్స్‌ చిల్డ్రన్స్‌ హోమ్‌ను సందర్శించగా హోంకు ఎలాంటి గుర్తింపు లేదని తేలింది.

అంతేకాకుండా హోంలో ఉన్న పిల్లలకు నిర్వాహకుడు నాణ్యమైన ఆహారం, వసతి కల్పించడం లేదని గుర్తించారు. నిర్వాహకుడు కుమార్‌ను విచారించి రికార్డులను స్వాధీనం చేసుకొని హోంను రద్దుచేశారు. హోంలో ఉన్న 21మంది పిల్లలలో ఇద్దరిని రామంతాపూర్‌లోని ట్రాన్సిట్‌ హోమ్‌కు తరలించగా.. 19మంది పిల్లలను తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. వీరందరినీ ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో చేర్పిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. మంత్రి కేటీఆర్‌ చొరువతో తమ పిల్లలు క్షేమంగా బయటపడ్డారని.. స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీడబ్ల్యూసీ సభ్యులు అర్చన, జయశ్రీ, డీడబ్ల్యూఓ అధికారిణి జ్యోతి, పద్మ, టీఆర్‌ఎస్‌ డివిజన్‌ ఇన్‌చార్జి నాగిళ్ల బాల్‌రెడ్డి, బత్తుల శ్రీకాంత్‌యాదవ్‌, జయకృష్ణ, బాబు గంగపుత్ర, సంపత్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌తో.. 21మంది పిల్లలు సేఫ్‌

ట్రెండింగ్‌

Advertisement