మంగళవారం 02 మార్చి 2021
Hyderabad - Jan 17, 2021 , 05:19:35

నాలా ప్రహరీ నిర్మాణానికి రూ. 68 కోట్లు

నాలా ప్రహరీ నిర్మాణానికి రూ. 68 కోట్లు

అంబర్‌పేట  : అంబర్‌పేట నియోజకవర్గ అభివృద్ధిపై రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ శనివారం సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌, మున్సిపల్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అర్వింద్‌కుమార్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌ కుమార్‌, జలమండలి ఎండీ దానకిశోర్‌, ఇతర ప్రభుత్వ విభాగాల ఉన్నతాధికారులతో ప్రగతిభవన్‌లో చర్చించారు. సమీక్ష వివరాలను ఎమ్మెల్యే వెల్లడించారు. పెండింగ్‌లో ఉన్న రత్నానగర్‌ నాలా ప్రహరీ నిర్మాణానికి రూ.68 కోట్లు మంజూరు చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్‌ చెప్పారన్నారు. అంబర్‌పేట ఛే నంబర్‌ ఫ్లైఓవర్‌ పనులను వెంటనే ప్రారంభించాలని, అవసరమైన డ్రైనేజీ, తాగునీటి పైప్‌లైన్‌లను మరోచోటికి మార్చాలని అధికారులను ఆదేశించారు. 

నియోజకవర్గంలో 8 జంక్షన్ల అభివృద్ధి, ఫుట్‌పాత్‌ల ఆధునికీకరణ, ఏసీ బస్‌బేలు, ఓపెన్‌ జిమ్‌ల ఏర్పాటుకు కూడా అంగీకరించారన్నారు. ఛే నంబర్‌లో రూ.15 కోట్లతో బాక్స్‌ డ్రెయిన్‌ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని మంత్రి తెలిపారన్నారు. గ్రేవ్‌ యార్డులను అభివృద్ధి చేయాలని, మూసారాంబాగ్‌ బ్రిడ్జి కాజ్‌వే స్థానంలో పెద్ద బ్రిడ్జి నిర్మించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. అంబర్‌పేట సబ్‌ డివిజన్‌ పరిధిలోని అడిక్‌మెట్‌ సెక్షన్‌లో నిరంతర తాగునీటి సరఫరాకు పైలట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేసుకొని అందుకు చర్యలు తీసుకోవాలని జలమండలి అధికారులకు ఆదేశాలు ఇచ్చారని ఎమ్మెల్యే వివరించారు. 


VIDEOS

logo