గురువారం 03 డిసెంబర్ 2020
Hyderabad - Nov 21, 2020 , 06:23:34

ప్రతిపక్షాలకు ఎన్నికలప్పుడే ప్రజలు యాదికొస్తరా..?

ప్రతిపక్షాలకు ఎన్నికలప్పుడే ప్రజలు యాదికొస్తరా..?

  • వరదలొచ్చినప్పుడు కాంగ్రెస్‌, బీజేపీ ఎక్కడున్నయ్‌
  • వాళ్ల జిత్తులమారి నాటకాలను ప్రజలు గమనిస్తున్నారు 
  • రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి 
  • అట్టహాసంగా జీడిమెట్ల డివిజన్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కేఎం పద్మ నామినేషన్‌

కుత్బుల్లాపూర్‌: కాంగ్రెస్‌, బీజేపీకి ఎన్నికలప్పుడే ప్రజలు యాదికొస్తరా..? వరదలొచ్చినప్పుడు ఆ పార్టీలు ఎక్కడున్నయ్‌ అని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి  ప్రశ్నించారు.  జీడిమెట్ల డివిజన్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కేఎం పద్మ నామినేషన్‌ దాఖలు కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యేలు కేవీ వివేకానంద్‌, జీవన్‌రెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డితో  కలిసి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. పోరాటాల ఫలితంగా ఏర్పడ్డ తెలంగాణ సమగ్రాభివృద్ధి దిశగా సీఎం కేసీఆర్‌ చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు.

 అభివృద్ధికి పాటుపడాల్సిన ప్రతిపక్షాలు, జిత్తులమారి రాజకీయాలకు తెరతీస్తున్న విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. వరదల కారణంగా నష్టపోయిన వారిని ఆ పార్టీల నేతలు ఓదార్చిన దాఖలాలు లేవని పేర్కొన్నారు. కష్టాల్లో రాని వారు ఇప్పుడేం మొఖం పెట్టుకొని ఓట్లడిగేందుకు వస్తున్నారని మండిపడ్డారు. వచ్చే నెల 1న జరిగే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు కేఎం ప్రతాప్‌, నాయకులు కేపీ విశాల్‌గౌడ్‌, సుధాకర్‌గౌడ్‌, కుంట సిద్ధిరాములు తదితరులు పాల్గొన్నారు.