మంగళవారం 27 అక్టోబర్ 2020
Hyderabad - Jun 20, 2020 , 23:41:08

రేపు స్లిప్‌ రోడ్ల ప్రారంభం

రేపు స్లిప్‌ రోడ్ల ప్రారంభం

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ప్రధాన రోడ్లపై ట్రాఫిక్‌ రద్దీని తగ్గించి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మళ్లించేందుకు ఉద్దేశించిన నాలుగు లింక్‌/స్లిప్‌ రోడ్లను ఈనెల 22వ తేదీన మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించనున్నారు. ఈ మేరకు హైదరాబాద్‌ రోడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చీఫ్‌ ఇంజినీర్‌ డా. సి.వసంత ఒక ప్రకటన జారీ చేశారు.

లింకురోడ్లు ఇవే....

  • -జీహెచ్‌ఎంసీ శేరిలింగంపల్లి జోనల్‌ కార్యాలయం నుంచి జాతీయ రహదారి నెం-65లో జీఎస్‌ఎం మాల్‌ వరకు వయా మంజీర పైప్‌లైన్‌ రోడ్డులో 2.70 కిలోమీటర్లు
  • -కూకట్‌పల్లి జోన్‌లో హైటెన్షన్‌ లైన్‌ నుంచి మియాపూర్‌ రోడ్డు వరకు ఒక కిలోమీటరు
  • -ఖైరతాబాద్‌ జోన్‌లో జూబ్లీహిల్స్‌ ప్రశాసన్‌నగర్‌ రోడ్‌ నె-70నుంచి జూబ్లీహిల్స్‌ నార్ని రోడ్‌ నెం-78 వరకు 0.47 కిలోమీటర్లు
  • -మణికొండ మున్సిపాలిటీ పరిధిలో నెక్నంపూర్‌ రోడ్‌ నుంచి ఉస్మాన్‌ఘర్‌ రోడ్డు వరకు వయా అల్కాపూర్‌ టౌన్‌షిప్‌ మార్గంలో 0.46 కిలోమీటర్లు


logo