e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, October 22, 2021
Home హైదరాబాద్‌ జలమండలి ఉద్యోగులకు ఆరోగ్య భద్రత

జలమండలి ఉద్యోగులకు ఆరోగ్య భద్రత

  • ఏడాదికి రూ.3 లక్షల వరకు వైద్యచికిత్స సదుపాయం
  • హెల్త్‌కార్డులు పంపిణీ చేసిన మంత్రి కేటీఆర్‌
  • 5051 ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబాలకు వర్తింపు
  • ఏడాదికి రూ.3 లక్షల వరకు వైద్య చికిత్స పథకం

సిటీబ్యూరో, సెప్టెంబర్‌ 20 (నమస్తే తెలంగాణ): జలమండలి ఉద్యోగులకు మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీ రామారావు హెల్త్‌ కార్డులను అందించారు. ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య భద్రత కోసం జలమండలి ఎండీ దానకిశోర్‌ విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం హెల్త్‌ ఇన్యూరెన్స్‌ కల్పించింది. ఈ మేరకు సోమవారం ప్రగతిభవన్‌లో మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా జలమండలి ఉద్యోగులు హెల్త్‌ కార్డులను అందుకున్నారు.

3,609 మంది ఉద్యోగులు, 894 మంది పెన్షనర్లకు, ఫ్యామిలీ పెన్షన్లు అందుకుంటున్న 548 మందికి, సుమారు 10 వేల మంది వరకు వారి కుటుంబ సభ్యులకు కూడా ఈ ఆరోగ్య బీమా వర్తించనున్నది. దేశ వ్యాప్తంగా ఉన్న వెయ్యి ప్రముఖ ఆస్పత్రుల్లో ఇక నుంచి జలమండలి ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులు ఏడాదికి రూ.3 లక్షల వరకు ఉచితంగా వైద్య సేవలు పొందవచ్చు.

- Advertisement -

ఉద్యోగి, పెన్షనర్‌తో పాటు వారిపై ఆధార పడిన ఐదుగురు కుటుంబ సభ్యులకు కూడా ఈ ఆరోగ్య బీమా వర్తిస్తుంది. హెల్త్‌ ఇన్యూరెన్స్‌కు సంబంధించి ప్రతియేటా రూ.6.78 కోట్ల ప్రీమియం మొత్తాన్ని జలమండలి చెల్లిస్తుంది. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మున్సిపల్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌ కుమార్‌, జలమండలి ఎండీ దానకిశోర్‌, సీజీఎంలు విజయ రావు, ఖాదర్‌, ఉద్యోగులు, వాటర్‌ వర్స్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ ప్రెసిడెంట్‌ రాంబాబు యాదవ్‌, అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ కె.రాజిరెడ్డి, జనరల్‌ సెక్రటరీ బి. జైరాజ్‌, వరింగ్‌ ప్రెసిడెంట్లు జి.లక్ష్మీనారాయణ, సయ్యద్‌ అక్తర్‌ అలీ, రామచంద్రారెడ్డితో పాటు ఇతర యూనియన్‌ నాయకులు పాల్గొన్నారు.

బీమా.. ముఖ్యాంశాలు:

  • జలమండలిలో పర్మినెంటు ఉద్యోగులుగా పని చేస్తున్న 3,609 మందికి, 894 మంది పెన్షన్‌దారులకు, 548 ఫ్యామిలీ పెన్షన్‌ దారులకు హెల్త్‌ కార్డులు మంజూరయ్యాయి.
  • ఉద్యోగితో పాటు వారిపై ఆధారపడే జీవిత భాగస్వామి, ఇద్దరు పిల్లలు (25 ఏండ్ల లోపు మగ పిల్లలు, అవివాహితులైన ఆడ పిల్లలు), ఇద్దరు తల్లిదండ్రులకు ఆరోగ్య బీమా వర్తిస్తుంది.
  • పెన్షన్‌ దారులతో పాటు వారి జీవిత భాగస్వామి, వారిపై ఆధారపడే ఇద్దరికి ఆరోగ్య బీమా ఉంటుంది.
  • అప్పుడే జన్మించిన ఉద్యోగుల పిల్లలకు కూడా బీమా వర్తిస్తుంది.
  • రూ.50 వేల వరకు ప్రసూతి సంబంధిత ఖర్చులు కూడా పొందవచ్చు.
  • ఏడాది చెకప్‌కు కూడా హెల్త్‌ ఇన్సూరెన్స్‌ వర్తిస్తుంది.
  • ఆయుర్వేద చికిత్స (ఆయూష్‌ ), అంబులెన్సు చార్జీలకు కూడా బీమా వర్తిస్తుంది.
  • అన్ని ఎమర్జెన్సీ వైద్య సేవలు, టెలీహెల్త్‌ సేవలకు కూడా ఈ బీమా సౌకర్యం ఉంటుంది.
  • హెర్నియా, గర్భాశయ చికిత్స, దంత వైద్యం, పుట్టుకతో వచ్చిన వ్యాధులకు చికిత్స, కాలేయ సంబంధ వైద్యం, ఈఎన్‌టీ వైద్య సేవలు, చర్మ వ్యాధులకు సంబంధించిన వైద్యానికి కూడా బీమా వర్తిస్తుంది.
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement