మహానగరాభివృద్ధికి ‘వ్యూహాత్మక’ అడుగులు ఫలితాలిస్తున్నాయి. ఏండ్ల తరబడి ట్రాఫిక్ కష్టాలతో సతమతమవుతున్న పౌరులకు ఉపశమనం కలిగించేందుకు సీఎం కేసీఆర్ ‘వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం’ (ఎస్ఆర్డీపీ) ప్రారంభించారు. ప్రధానంగా జంక్షన్ల వద్ద వెతలు తీర్చేందుకు ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణంతోపాటు రహదారుల విస్తరణ చేపడుతున్నారు. ఇప్పటివరకు రూ.1010 కోట్లకు పైగా వ్యయంతో చేపట్టిన 18 ప్రాజెక్టులు అందుబాటులోకి రాగా, వాటి ఫలితాలు చవిచూస్తున్నారు. ఎస్ఆర్డీపీలో చేపట్టిన మరో ప్రాజెక్టు నగరవాసులకు అందుబాటులోకి రానుంది. రూ.66.59 కోట్లతో కేపీహెచ్‌బీ-హైటెక్‌సిటీ మార్గంలో నిర్మించిన రైల్వే అండర్ బ్రిడ్జి (ఆర్యూబీ)ని సోమవారం పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. 410 మీటర్ల పొడవు, 20.60 మీటర్ల వెడల్పుతో నిర్మించిన ఈ దిగువ వంతెనతో కేపీహెచ్‌బీ-హైటెక్‌సిటీ మార్గంలో ట్రాఫిక్ సమస్య శాశ్వతంగా తొలగనుంది.
హైదరాబాద్ నగరాన్ని సిగ్నల్ ఫ్రీ రహదారుల నగరంగా మార్చేందుకు సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం (ఎస్ఆర్డీపీ)లో చేపట్టిన మరో ప్రాజెక్టు నగరవాసులకు అందుబాటులోకి రానుంది. తాజాగా రూ. 66.59కోట్ల వ్యయం తో నిర్మాణం పూర్తయిన హైటెక్‌సిటీ రైల్వే అండర్ బ్రిడ్జిని పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు సోమవారం ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఎస్ఆర్డీపీ కింద దాదాపు రూ.1010కోట్లకు పైగా వ్యయం తో చేపట్టిన 18 ప్రాజెక్టులు నగరపౌరులకు అందుబాటులోకి వచ్చాయి. సుమా రు 410 మీటర్ల పొడవు, 20.60 మీటర్ల వెడల్పు కలిగిన ఈ ఆర్‌యూబీతో హైటెక్‌సిటీ-ఎంఎంటీఎస్ రైల్వే మార్గంలో ఏ విధమైన ట్రాఫిక్ అవాంతరాలు లేకుండా ట్రాఫిక్ వెళ్లే అవకాశం ఏర్పడుతుంది.
ఈ ఆర్యూబీ నిర్మాణానికి ముందు ఈ బ్రిడ్జి కింద 40వేల లీటర్ల నీరు ఉండేది. దీంతో అండర్ బ్రిడ్జి ఎప్పుడూ నీటితో ఉండేది. ఇక భారీ వర్షాలు పడితే అక్కడి పరిస్థితులు వర్ణనాతీతం. ప్రస్తుతం ఈ నీటిని నిల్వ చేయడానికి సమీపంలో పెద్ద సంపును నిర్మించారు. ఈ సంపులో నిల్వ చేసిన నీటిని మూసాపేట సర్కిల్లో నాటిని హరితహారం మొక్కలకు నీరందిస్తున్నారు. మొత్తానికి ఎన్నో ఏండ్లుగా ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఈ ఆర్యూబీ నిర్మాణంతో తీరుతున్నందున స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్ నగరాన్ని సిగ్నల్ ఫ్రీ సిటీగా మార్చే క్రమంలో భాగంగా చేపట్టిన ఎస్ఆర్డీపీ ప్రాజెక్టులు 18 చోట్ల అందుబాటులోకి వచ్చాయి. రూ.1010.77కోట్ల వ్యయంతో చేపట్టి పూర్తయిన ఈ పనుల్లో తొమ్మిది ఫ్లై ఓవర్లు, నాలుగు అండర్‌పాస్‌లు, మూడు ఆర్వోబీలు, ఒక కేబుల్ బ్రిడ్జి ఉంది.