ఆదివారం 17 జనవరి 2021
Hyderabad - Nov 28, 2020 , 06:59:23

కులవృత్తులకు చేయూత: మంత్రి కొప్పుల

కులవృత్తులకు చేయూత: మంత్రి కొప్పుల

వినాయక్‌నగర్‌ : టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కుల వృత్తులకు బాసటగా నిలుస్తుందని, క్షౌరశాలలకు, దోబీ ఘాట్లు, లాండ్రీ షాపులకు ఉచితంగా కరెంటు అందించనున్నదని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పేర్కొన్నారు. ఆయన శుక్రవారం వెంకటాపురం దివిజన్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సబితాకిశోర్‌తో కలిసి ఎన్నికల ప్రచారం చేశారు. వరదలతో నష్టపోయిన కుటుంబాలకు రూ. 10 వేల చొప్పున ఆర్థిక సాయం అందించామని, మిగతా వారికీ ఈ నెల 4వ తేదీ తర్వాత ఇస్తామని పేర్కొన్నారు. కారు గుర్తుకు ఓట్లు వేసి టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.  ఈ కార్యక్రమంలో డివిజన్‌ అధ్యక్షుడు అనిల్‌కిశోర్‌, రఘునాథ్‌, శివ, పుదారి రాజేశ్‌గౌడ్‌(కన్న), ప్రభాకర్‌, జీ రాజేశ్‌గౌడ్‌, జ్యోతి, లక్ష్మి పాల్గొన్నారు.

కుట్రలను తిప్పికొట్టాలి


  • చిలుకానగర్‌ను దత్తత తీసుకొని అభివృద్ది చేస్తా 
  • మంత్రి సత్యవతి రాథోడ్‌ 

ఉప్పల్‌ : జీహెచ్‌ఎంసీలో బీజేపీ చేస్తున్న కుట్రలను ప్రజలు ఓటుతో తిప్పికొట్టాలని మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. నగరంలో మత సామరస్యాన్ని కాపాడాలని, గంగా-జమున తెహజీబ్‌ లాంటి హైదరాబాద్‌ సంస్కృతిని కాపాడుతున్న సీఎం కేసీఆర్‌ నాయకత్వంలోని టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇవ్వాలని కోరారు. శుక్రవారం చిలుకానగర్‌ డివిజన్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి బన్నాల గీతా ప్రవీణ్‌ ముదిరాజ్‌కు మద్దతుగా ప్రచారం చేపట్టారు. అనంతరం పెద్దమసీదు, పాత మసీదులను సందర్శించి ప్రార్థనలు చేశారు.  అనంతరం ముస్లింలను కలిసి టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇవ్వాలని కోరారు. చిలుకానగర్‌వాసిగా ఈ డివిజన్‌ను దత్తతా తీసుకుంటున్నాని మంత్రి సత్యవతి ప్రకటించారు. గతంలో కన్నా అధిక మెజార్టీతో బన్నాల గీత ప్రవీణ్‌ను గెలిపించాలని కోరారు.