బుధవారం 27 జనవరి 2021
Hyderabad - Nov 26, 2020 , 06:37:16

టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి: మంత్రి కొప్పుల

టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి: మంత్రి కొప్పుల

వినాయక్‌నగర్‌ : టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యమని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. ఉదయం వెంకటాపురం డివిజన్‌లో పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్‌ మాట్లాడుతూ అల్వాల్‌ సర్కిల్‌ ప్రజల దాహార్తిని తీర్చేందుకు రూ.190కోట్లతో ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్‌ ఇస్తున్నామని వివరించారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు ప్రభుత్వ పథకాలను వివరిస్తూ ఓట్లు అభ్యర్థించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పార్టీ అభ్యర్థి సబితాకిశోర్‌, డివిజన్‌ అధ్యక్షుడు అనిల్‌కిశోర్‌, ఈఎస్‌ లక్ష్మణ్‌, రమేశ్‌, సయ్యద్‌ మోసిన్‌, రఘునాథ్‌, శివ, పుదారి రాజేశ్‌గౌడ్‌(కన్న), శ్యాంసుందర్‌, ప్రభాకర్‌, ప్రసన్న, లక్ష్మి, జ్యోతి పాల్గొన్నారు.

అభివృద్ధిని చూసి ఓట్లేయండి: మంత్రి ప్రశాంత్‌రెడ్డి 


గాజులరామారం: బస్తీలు, కాలనీల్లో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి టీఆర్‌ఎస్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి కోరారు.  ఆయన గాజుల రామారం డివిజన్‌ పరధిలోని ఎన్‌టీఆర్‌ఎస్‌నగర్‌, శ్రీరాంనగర్‌, బెకిరిగడ్డ, చంద్రగిరినగర్‌లలోఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజుతో కలిసి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి రావుల శేషగిరికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాతూ కోట్ల రూపాయలు ఖర్చుచేసి బస్తీల్లో తాగునీరు, భూగర్భడ్రైనేజీ, సీసీరోడ్లు, విద్యుద్దీపాల సమస్యలు పరిష్కరించినట్టు చెప్పారు.  గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలని వారు విజ్ఞప్తి చేశారు. 


logo