గురువారం 28 జనవరి 2021
Hyderabad - Nov 26, 2020 , 06:32:52

బీజేపీకి బుద్ధి చెప్పాలి: మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

బీజేపీకి బుద్ధి చెప్పాలి: మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

బంజారాహిల్స్‌: ఏం చేస్తారో చెప్పకుండా మతం పేరుతో చిచ్చుపెడుతున్న బీజేపీ నాయకులకు ఓటుతో బుద్ధి చెప్పాలని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు.  బంజారాహిల్స్‌లోని ఎంపీ కేకే నివాసం వద్ద ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు.  బీజేపీ నేతల ప్రసంగాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో సర్జికల్‌ స్ట్రైక్‌ చేస్తామంటూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న బీజేపీ నేతల తీరు తీవ్ర అభ్యంతరకరమన్నారు. బీజేపీ నేతల చిల్లర మాటలను ప్రజలు నమ్మరని, గ్రేటర్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు కచ్చితంగా వంద సీట్లు వస్తాయని పేర్కొన్నారు.

తాజావార్తలు


logo