e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 20, 2021
Home హైదరాబాద్‌ వసతి చూపి.. భరోసానిచ్చి

వసతి చూపి.. భరోసానిచ్చి

వసతి చూపి.. భరోసానిచ్చి
  • నిర్మాణ రంగ కార్మికులకు బిల్డర్ల అభయం
  • కరోనా నేపథ్యంలో నగరం విడిచిపోకుండా భరోసా..
  • కార్మికుల కోసం భవనాల వద్దే ప్రత్యేక ఏర్పాట్లు
  • నిర్మాణ రంగం కుదేలు కాకుండా ఐసోలేషన్‌ కేంద్రాలు, కొవిడ్‌ టీకాలు

గతేడాది కరోనా వైరస్‌ వలస కార్మికుల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపింది. చేతిలో పనిలేక, తినేందుకు తిండి దొరక్క ప్ర భుత్వం ఏర్పాటు చేసిన క్యాంపుల్లో తింటూ అతి కష్టం మీద సొంతూళ్లకు బయల్దేరారు. ఆ సమయంలో వలస కార్మికుల కష్టాలు అందరికీ కన్నీరు తెప్పించాయి. తాజా గా కరోనా సెకండ్‌ వేవ్‌ తీవ్ర రూపం దాల్చింది. అయితే, ఈ ప్రభావం వలస కార్మికులపై ఉండకూడదనే లక్ష్యంతో భవన నిర్మాణ రంగంలోని బిల్డర్లు, డెవలపర్లు ప్రత్యేకంగా ఎక్కడికక్కడ చర్యలు తీసుకుంటున్నారు. భవన నిర్మాణ రంగంపై ప్రభుత్వ పరంగా ఎలాంటి ఆంక్షలు లేకపోవడంతో నిర్మాణ రంగం పనులు సాఫీగా జరుగుతున్నాయి. ఇందుకు బిల్డర్లు తాము నిర్మిస్తున్న అపార్టుమెంట్లు, విల్లా, గేటెడ్‌ కమ్యూనిటీ ప్రాజెక్టుల వద్దే కార్మిక కోసం ప్రత్యేకంగా క్యాంపులను ఏర్పాటు చేస్తున్నారు.

కార్మికులు నివాసం ఉండే క్యాంపుల నుంచి పనులు చేసే సైట్ల వద్ద ప్రతి ఒక్కరూ తప్పని సరిగా మాస్కులు ధరించడం, పనిలోకి వచ్చే ముందు వారికి థర్మా మీటర్‌తో జ్వరం ఉందా లేదా చూడటం, భౌతిక దూరం పాటించడం, శానిటైజేషన్‌ వంటివి కచ్ఛితంగా పాటించేలా చర్యలు చేపట్టారు. దీంతో భవన నిర్మాణ రంగ కార్మికుల కరోనా అంటే భ యం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటూ పనులు చేస్తే ఉపాధితో పాటు ఆరోగ్యంగా ఉండేలా చేస్తున్నారు. అదే విధంగా జాతీయ స్థాయిలో విస్తరించి ఉన్న క్రెడాయ్‌ సంస్థ తరపున భవన నిర్మాణ రంగంలోని కార్మికులందరికీ కొవిడ్‌ టీకాను సైట్ల వద్దే కార్మికులకు ఇప్పించే ఏర్పా ట్లు చేస్తున్నారు. ఒక్క మహా నగరంలోనే సుమారు 10 నుంచి 12 లక్షల మంది కార్మికులు భవన నిర్మాణ రంగం లో పనిచేస్తున్నారు. వీరందరికీ కొవిడ్‌ నిరోధక టీ కాలను వేయించి, వారి ఉపాధికి డోకా లేకుండా నిర్మాణ రంగం లో పనులు సాఫీగా జరిగేలా బిల్డర్లు, డెవలపర్లు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.

గత అనుభవాల యాదిలో..

భవన నిర్మాణ రంగంలో లక్షలాది మంది కార్మికులు మహా నగర చుట్టు పక్కల్లో ఉంటూ పలు నిర్మాణ కంపెనీల్లో పని చేస్తున్నారు. ప్రధానంగా ఐటీ కారిడార్‌లోని మాదాపూర్‌, గచ్చిబౌలి, నానక్‌రాంగూడ, కోకాపేట, తెల్లాపూర్‌తో పాటు మియాపూర్‌, బాచుపల్లి, ఉప్పల్‌, ఎల్‌బీనగర్‌, శంషాబాద్‌ వంటి ప్రాంతాల్లో భారీ నిర్మాణాలు జరుగుతుండగా కార్మికులు అక్కడే పనిచేస్తున్నారు. వీరంతా తెలుగు రాష్ర్టాల నుంచే కాక అన్ని రాష్ర్టాల నుంచి వచ్చిన వారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న క్రెడాయ్‌ తెలంగాణ చాప్టర్‌, క్రెడా య్‌ హైదరాబాద్‌, ట్రెడా, తెలంగాణ బిల్డర్స్‌ అసోసియేషన్‌, తెలంగాణ డెవలప్స్‌ ఫోరం ఇలా పలు నిర్మాణ రంగాలకు సంబంధించిన సంఘాలు, కార్మికులు కరోనాకు భయపడి తమ స్వస్థలాలకు వెళ్లకుండా వారికి ఇక్కడే మెరుగైన మౌలిక వసతులు కల్పించి, పనులు చేసుకునేలా ఏర్పాట్లు చేశారు.

పనులు సాఫీగా జరిగేలా..

గతేడాది లాక్‌డౌన్‌తో ఐదు నెలల పాటు నిర్మాణ పనులన్నీ నిలిచిపోయాయి. కార్మికులంతా స్వస్థలాలకు వెళ్లిపోయారు. మళ్లీ వారంతా తిరిగి వచ్చి పనులు చేసేందుకు చాలా సమయం పట్టింది. దీంతో కస్టమర్లకు సమయాని కి ఇళ్లు, అపార్టుమెంట్ల నిర్మాణాలు చేసి ఇవ్వలేకపోయా రు. దీనికి తోడు ఆర్థికంగా భారం పెరిగింది. సెకండ్‌ వేవ్‌ వల్ల మళ్లీ అలాంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు నిర్మా ణ రంగంలోని సంఘాలన్నీ ఒక్కటై కార్మికులతో పనులు చేయించుకోవడానికి, వారి ఆరోగ్యానికి అవసరమైన చర్య లు తీసుకుంటున్నాయి. ప్రస్తుతం, భవన నిర్మా ణ రంగం పనులు సాఫీగానే సాగుతున్నాయని చెబుతున్నారు.

నిర్మాణ రంగంలో లక్షలాది మంది కార్మికులు

భవన నిర్మాణ రంగం లో తెలుగు రాష్ర్టాలకు చెందిన వారే కాకుం డా దేశంలోని వివిధ రాష్ర్టాలకు చెందిన వా రు లక్షల్లోనే ఉన్నారు. వ్యవసాయ రంగం తర్వాత అత్యధికంగా ఉద్యోగ, ఉపాధినిచ్చేది రియల్‌ ఎస్టేట్‌ రంగమనే చెప్పాలి. ప్రస్తుతం, కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రభావం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో భవన నిర్మాణ రంగ కార్మికులకు క్రెడాయ్‌ హైదరాబాద్‌ చాప్టర్‌ తరపున కొవిడ్‌ టీకా వేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. గతేడాది లాగే ఇబ్బందులు మళ్లీ పడకుండా, ఉపాధి కోల్పోకుండా అవసరమైన అన్ని రకా ల చర్యలను గ్రేటర్‌లోని బిల్డర్లు తీసుకుంటున్నారు. కార్మికుల ఆరోగ్య భద్రత కోసం కొవి డ్‌ నిబంధనలను పాటిస్తూ పనులు జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం. – ఉపేందర్‌, కార్యవర్గ సభ్యులు, క్రెడాయ్‌ – హైదరాబాద్‌

కార్మికులకు కొవిడ్‌ టీకా

కార్మికులందరికీ కొవిడ్‌ టీకా ఇప్పించే విషయ మై రియల్‌ ఎస్టేట్‌ సంస్థలతో కలిసి తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపాం. మే 1వ తేదీ తర్వాత దశల వారీగా భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న వారందరికీ ఉచితంగా టీకా ఇప్పిచేందుకు కార్యాచరణ సిద్ధం చేశాం. నిర్మాణ రంగానికి సంబంధించిన క్రెడాయ్‌ జాతీయ స్థాయిలో పనిచేస్తోంది. సుమారు రెండు కోట్ల మంది వరకు భవన నిర్మాణ రంగం లో కార్మికులు పనిచేస్తున్నారు. వారిని ప్రాథమికంగా గుర్తించాం. వారందరికీ టీకా వేయించేందుకు క్రెడాయ్‌ పనిచేస్తుంది. – జి.రాంరెడ్డి, జాతీయ ఉపాధ్యక్షులు – క్రెడాయ్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
వసతి చూపి.. భరోసానిచ్చి

ట్రెండింగ్‌

Advertisement