బుధవారం 02 డిసెంబర్ 2020
Hyderabad - Sep 05, 2020 , 00:31:51

నేటి నుంచి మెట్రో ట్రయల్‌ రన్‌

నేటి నుంచి మెట్రో ట్రయల్‌ రన్‌

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: మెట్రో ప్రయాణానికి అధికారులు చకచకా ఏర్పాట్లు చేశారు. అందులో భాగంగానే ప్రయాణికుల భద్రత దృష్ట్యా మెట్రో ట్రయల్‌ రన్‌కు శనివారం నుంచి శ్రీకారం చుట్టనున్నారు. అమీర్‌పేట్‌ నుంచి మియాపూర్‌ వరకు మెట్రో ట్రయల్‌ రన్‌ నడుస్తుంది. కొవిడ్‌ పరిస్థితుల కారణంగా 5 నెలలకు పైగా విరామం ఇచ్చిన మెట్రో మళ్లీ పట్టాలెక్కనుండటంతో అధికారులు ఏర్పాట్లు పరిశీలిస్తున్నారు. మొదటి దశలో భాగంగా అమీర్‌ పేట్‌ నుంచి రైలు ప్రారంభమై మియాపూర్‌ స్టేషన్‌ వరకు వెళుతుంది. మార్గమధ్యంలో రైలు పనితీరు, సమయం, ఏసీ కండిషన్‌, డోర్స్‌ తదితర అన్నింటిని క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. స్మార్ట్‌ కార్డు, మొబైల్‌ క్యూఆర్‌ కోడ్‌ తదితర క్యాష్‌లెస్‌ పేమెంట్‌పై ప్రయాణికులకు అవగాహన కార్యక్రమం చేపట్టనున్నారు. మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి అధ్యక్షతన అధికారులతో శనివారం సమావేశం జరగనున్నది. స్టేషన్లలో శానిటైజేషన్‌ ప్రక్రియ, భౌతికదూరం పాటించడం, మాస్కులు ధరించడం, సీసీ కెమెరా నిఘా తదితర అంశాలపై చర్చిస్తారు.