శుక్రవారం 05 జూన్ 2020
Hyderabad - Jan 20, 2020 , 16:49:55

ఈనెల 22,23 తేదీల్లో నిథమ్‌ ఆధ్వర్యంలో మెగా జాబ్‌ ఫెయిర్‌

ఈనెల 22,23 తేదీల్లో నిథమ్‌ ఆధ్వర్యంలో మెగా జాబ్‌ ఫెయిర్‌

పర్యాటకరంగంలో అతిథ్యవిభాగంలో అపరమిత అవకాశాలున్నాయి.

హైదరాబాద్: పర్యాటకరంగంలో అతిథ్యవిభాగంలో అపరమిత అవకాశాలున్నాయి. ఈ రంగంలో ఉపాధి పొందాలనుకునే యువకుల కోసం ది నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టూరిజం అండ్‌ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌(నిథమ్‌) ఆధ్వర్యంలో ఈనెల 22,23 తేదీల్లో హైదరాబాద్‌లో మెగా జాబ్‌ ఫెయిర్‌ నిర్వహిస్తున్నారు. ఈమేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. పర్యాటక రంగంలో ఉపాధి కోసం చూస్తున్న యువతకు ఇది మంచి అవకాశామన్నారు. ఆతిథ్య రంగంలో పర్యాటకం, సౌకర్యాలు, హోటల్స్‌, రిసార్ట్స్‌, ఎయిర్‌పోర్టు జాబ్స్‌, ఈవెంట్స్‌ వంటి వాటిలో ఉపాధి పొందవచ్చని పేర్కొన్నారు. సమ్మర్‌ ఇంటర్న్‌షిప్‌, పార్ట్‌టైం, వీకెండ్‌ జాబ్స్‌, ఫుల్‌టైం ప్లేస్‌మెంట్స్‌ జాబ్‌ ఫేయిర్‌కు హాజరుకావచ్చని తెలిపారు. 

డిగ్రీ, పీజీ స్టూడెంట్స్‌ కేవలం ఎయిర్‌పోర్టు, ఈవెంట్‌ జాబ్స్‌కు హాజరు కావచ్చన్నారు. హోటల్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ టూరిజం స్టూడెంట్స్‌కు పార్ట్‌టైం అండ్‌ ఫుల్‌టైం జాబ్స్‌కు అవకాశం ఉందన్నారు. 2018, 2019 పాస్‌డ్‌ అవుట్‌ విద్యార్థులు కూడా హాజరుకావచ్చని పేర్కొన్నారు. జాబ్‌ ఫేయిర్‌కు 90 రిక్రూటింగ్‌ కంపెనీలు హాజరవుతున్నాయని తెలిపారు. తాజ్‌మారియట్‌, ఐటీసీ, నోవాటెల్‌, ఏరిండియా శాట్స్‌, జీఎంఆర్‌ ఎయిర్‌పోర్టు, ఐకియా, అమెజాన్‌, మెక్‌డోనాల్డ్స్‌, స్టార్‌బక్స్‌, థామస్‌కుక్‌, ఎస్‌ఓటీసీ, అక్బర్‌, బాల్‌మారియే, మేక్‌మైట్రిప్‌, క్రూయిజ్‌ లైనర్స్‌ పీఅండ్‌ఓ, కోస్టా, ప్రిన్సెస్‌ క్రూయిజ్‌, యాక్సెస్‌ ఈవెంట్స్‌, స్పైస్‌జెట్‌, ఓమన్‌ ఏయిర్‌, అలంక్రిత అండ్‌ లియోనియా రిసార్ట్స్‌ వంటి తదితర సంస్థల్లో అవకాశాలున్నాయని తెలిపారు. 

22న హోటల్స్‌, రిసార్ట్స్‌, క్రూయిజ్‌ లైనర్స్‌, రిటేయిలర్స్‌, ఫెసిలిటీస్‌ అండ్‌ కన్‌సల్టెంట్స్‌ ఫర్‌ విదేశీ ఇంటర్న్‌షిప్స్‌ ఇంటర్వ్యూలు, 23న ట్రావెల్‌ ఏజంట్లు, టూర్‌ ఆపరేటర్లు, ఏయిర్‌లైన్స్‌ ఇంటర్వ్యూలు ఉన్నాయని పేర్కొన్నారు. దేశంలోని అన్ని టూరిజం కళాశాలలో చదువుతున్న డిగ్రీ, పీజీ చదవుతున్న విద్యార్ధులు దీనికి అర్హులన్నారు. 22,23 తేదీలలో గచ్చిబౌలిలోని నిథమ్‌ క్యాంపస్‌లో ఉదయం 9 గంటల నుంచి ఇంటర్వ్యూలు ప్రారంభమవుతాయని, వివరాల కోసం 9553700035, 9703178671 వాట్సాప్‌ నంబర్లను సంప్రదించాలన్నారు.


logo