e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 23, 2021
Home హైదరాబాద్‌ సర్కారు బడుల్లో వైద్య శిబిరాలు షురూ..

సర్కారు బడుల్లో వైద్య శిబిరాలు షురూ..

సర్కారు బడుల్లో వైద్య శిబిరాలు షురూ..
  •  ఆర్‌బీఎస్‌కే కింద విద్యార్థులకు ఉచితంగా  వైద్య పరీక్షలు
  •  ఇప్పటి వరకు 700 మంది పిల్లలకు వైద్య పరీక్షలు

జూబ్లీహిల్స్‌,మార్చి9: ప్రభుత్వ పాఠశాలల్లో  రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం వైద్య శిబిరాలు ప్రారంభమయ్యా యి. నగరంలో తల్లిదండ్రులు  పొద్దున్నే  పనులకు వెళ్లే యాంత్రిక జీవనంలో పిల్లల ఆలనాసాలనా చూసే  వారులేక  వైద్య  సౌకర్యాలకు దూరంగా ఉంటున్న ప్రభుత్వ పాఠశాలల  విద్యా ర్థులకు వారి తరగతి గదుల్లోనే చేపడుతున్న ఉచిత వైద్య శిబి రాలు కొండంత అండగా మారుతున్నాయి.ఇటీవల పాఠ శాల లు ప్రారంభమవడంతో శ్రీరాంనగర్‌ అర్బన్‌ హెల్త్‌ న్యూట్రీ షన్‌ సెంటర్‌  ఆధ్వర్యంలో ఆర్‌బీఎస్‌కే టీమ్‌-ఏ, టీమ్‌-బీ ఆధ్వ ర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో వైద్య శిబిరాలు ప్రారంభిం చారు. టీమ్‌-ఏ ఆధ్వర్యంలో మంగళవారం యూసుఫ్‌గూడ సర్కిల్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో వైద్య శిబిరాలు నిర్వహిం చారు. మెడికల్‌ ఆఫీసర్లు డాక్టర్‌ ఎం.మమత, డాక్టర్‌ డి.రా జే శ్వరి బృందం విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. విద్యార్థులకు విటమిన్‌ లోపాలు, చర్మ, గొంతు, దంత, కంటి, వినికిడి,గుండె సంబంధిత సమస్యలను గుర్తించి చికిత్స అంది స్తున్నామని ఆర్‌బీఎస్‌కే బృందం తెలిపారు. పిల్లల ఎదుగుదల లోపం, ఎనీమియా లోపాలను గుర్తించి 9గ్రాములకంటే తక్కు వ హిమోగ్లోబిన్‌ ఉన్న పిల్లలకు ఐరన్‌, కాల్షియం టాబెట్లు ఇస్తు న్నట్లు డాక్టర్లు తెలిపారు.పిలల్లకు ఏదైనా ఆపరేషన్‌ అవస రమైతే  వారిని నీలోఫర్‌ దవాఖానకు తర లించి చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలి పారు. ఎస్‌పీహెచ్‌ఓ డాక్టర్‌ అను రాధ ఆధ్వర్యంలో డాక్టర్లు మమత, రాజేశ్వరి, ఫార్మాసిస్ట్‌ దివ్య,ఏఎన్‌ఎం గ్రేస్‌ రవితేజ్‌తో పాటు ఆర్‌బీఎస్‌కే వైద్య సిబ్బంది పాఠశాల లు పునఃప్రారంభమైన తరువాత 700 మందికిపైగా పిల్లలకు వైద్య పరీక్షలు చేసి మందులిచ్చామని తెలిపారు.    

పిల్లలందరికీ ఉచితంగా పరీక్షలు

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులందరికీ అన్ని రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేస్తున్నాం. శ్రీరాంనగర్‌ యూహెచ్‌ఎన్‌సీ ఆధ్వర్యంలో యూసుఫ్‌గూడ, జూబ్లీ హిల్స్‌ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో పరీక్షలు చేస్తున్నాం.జవహర్‌నగర్‌ పాఠశాలలో ఇప్పటి వరకు  700 మంది విద్యార్థులకు పరీక్షలు చేశాం. -మమత, టీమ్‌-ఏ, మెడికల్‌ ఆఫీసర్‌,ఆర్‌బీఎస్‌కే,శ్రీరాంనగర్‌.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
సర్కారు బడుల్లో వైద్య శిబిరాలు షురూ..

ట్రెండింగ్‌

Advertisement