ఆదివారం 29 నవంబర్ 2020
Hyderabad - Oct 24, 2020 , 09:05:20

ముంపు ప్రాంతాల్లో వ్యాధులు ప్రబలకుండా చర్యలు

ముంపు ప్రాంతాల్లో వ్యాధులు ప్రబలకుండా చర్యలు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : భారీ వర్షాలతో బురద, వ్యర్థాలు పేరుకుపోయిన నేపథ్యంలో వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు డీఆర్‌ఎఫ్‌, ఎంటమాలజీ బృందాలు నగరవ్యాప్తంగా సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని విస్తృతంగా పిచికారీ చేస్తున్నాయి. ట్యాంకర్లు, పవర్‌ స్ప్రేయర్ల ద్వారా జనావాసాల మధ్య, నీరు నిలిచిన ప్రాంతాల్లో ద్రావణాన్ని చల్లుతున్నారు. డీఆర్‌ఎఫ్‌, దోమల నివారణ బృందాలు సర్కిళ్ల వారీగా ముంపు ప్రాంతాలను ఎంపిక చేసుకొని క్రిమి సంహారక ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నాయి. ముందుగా సమస్యాత్మక ప్రాంతాల్లో ద్రావణాన్ని స్ప్రే చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. నదీంకాలనీ, జుబైల్‌ కాలనీ, కబీర్‌నగర్‌, చాంద్రాయగుట్టలోని బండ్లగూడ రాజీవ్‌గాంధీనగర్‌, నర్సింహకాలనీ, ఉప్పుగూడ శివాజీనగర్‌, పల్లె చెరువు పరిసర కాలనీలు, ఆసిఫ్‌నగర్‌, అహ్మద్‌ కాలనీ, ఖైరతాబాద్‌లోని ఎంఎస్‌ మక్తా, బీఎస్‌మక్తా, బీజేఆర్‌ నగర్‌, గాంధీనగర్‌, అడిక్‌మెట్‌ నాగమయ్య కుంట, పద్మాకాలనీ తదితర ప్రాంతాల్లో ఇప్పటివరకు రసాయనాల పిచికారీ పూర్తయినట్లు వారు వివరించారు.