e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 17, 2021
Home హైదరాబాద్‌ అధైర్యపడొద్దు

అధైర్యపడొద్దు

అధైర్యపడొద్దు
  • కొవిడ్‌ రోగులకు భరోసా ఇచ్చిన మేయర్‌ విజయలక్ష్మి
  • ఉస్మానియాలో కొవిడ్‌ సేవలు, పారిశుధ్య పనుల పరిశీలన
  • పలు ప్రాంతాల్లో ఆకస్మిక పర్యటనలు..

సిటీబ్యూరో, మే 25 (నమస్తే తెలంగాణ): గ్రేటర్‌లో పారిశుధ్య కార్యక్రమాల పర్యవేక్షణకు మేయర్‌ గద్వాల విజయలక్ష్మి పలు ప్రాంతాల్లో సుడిగాలి పర్యటన చేశారు. మంగళవారం ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆమె పర్యటన కొనసాగింది. తొలుత ఉస్మానియా దవాఖానను ఆమె సందర్శించారు. అక్కడ ఏర్పాటు చేసిన అన్నపూర్ణ కేంద్రం వద్ద పేరుకుపోయిన చెత్తను వెంటనే తొలగించాలని.. భోజన కేంద్రాన్ని పరిశుభ్రమైన వాతావరణంలోకి మార్చాలని ఆధికారులను ఆదేశించారు. అనంతరం దవాఖాన లోపల పారిశుధ్య పనులను పర్యవేక్షించారు. కరోనా రోగులతో మాట్లాడారు. బాధితుల సమస్యలను సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకు వెళ్లి పరిష్కరిస్తానని.. ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని.. ప్రభుత్వం అండగా ఉంటుందని ఈ సందర్భంగా మేయర్‌ వారికి హామీ ఇచ్చారు.

  • జియాగూడ రోడ్డులో మూసీ పక్కన పేరుకుపోయిన చెత్తను వెంటనే తొలగించాలని మేయర్‌ ఆదేశించారు.
  • చార్మినార్‌ జోన్‌లో కోడా శ్మశానవాటిక వద్ద ఉన్న చెత్తను తొలగించాలని సూచించారు.
  • లంగర్‌హౌస్‌, గోల్కొండ ప్రాంతాలలో పారిశుధ్య పనులను తనిఖీ చేశారు.
  • మోతిదర్వాజ నాలా వద్ద పేరుకుపోయిన చెత్తను తొలగించాలన్నారు.
  • చారిత్రక ప్రాంతాలు ఆక్రమణలకు గురి కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
  • జీహెచ్‌ఎంసీ కంట్రోల్‌ రూంను మేయర్‌ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కంట్రోల్‌ రూంకు వివిధ సమస్యలపై 61 మంది ఫోన్‌ చేసినట్లు వైద్యులు మేయర్‌కు వివరించారు.
  • మంగళవారం నుంచి రెండో డోసు వ్యాక్సిన్‌ ప్రక్రియ ప్రారంభం అయిందని, బెడ్స్‌ కోసం ఎవరూ కంట్రోల్‌ రూంకు ఫోన్‌ చేసినా వెంటనే వారికి బెడ్‌ ఇప్పించేలా చూడాలని కోరారు.
  • అన్నపూర్ణ కేంద్రాల ద్వారా సోమవారం ఒక్కరోజే 66,610 మందికి భోజనం పంపిణీ చేశామన్నారు.
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
అధైర్యపడొద్దు

ట్రెండింగ్‌

Advertisement