బాధ్యతలు స్వీకరించిన మేయర్, డిప్యూటీ మేయర్

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌గా మోతె శ్రీలతారెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఉదయం బల్దియా ప్రధాన కార్యాలయం ఏడో అంతస్తులోని చాంబర్లో సర్వమత ప్రార్థనలు నిర్వహించిన అనంతరం గద్వాల్ విజయలక్ష్మి మేయర్ పీఠాన్ని అధిష్టించారు. ఈ కార్యక్రమానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీలు కే. కేశవరావు, బండా ప్రకాశ్ ముదిరాజ్, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ విద్యాసాగర్, ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎమ్మెల్సీ ప్రభాకర్, కార్పొరేటర్లు హాజరయ్యారు.
హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మేయర్‌గా గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌గా మోతె శ్రీలతారెడ్డి సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని ఏడో అంతస్తులో ఉదయం సర్వమత ప్రార్థనలు నిర్వహించిన అనంతరం మేయర్, డిప్యూటీ మేయర్ బాధ్యతలు స్వీకరించే ఫైల్‌పై సంతకం చేశారు. కార్యక్రమానికి ఎంపీలు కె. కేశవరావు, బండా ప్రకాశ్ ముదిరాజ్, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ విద్యాసాగర్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ ప్రభాకర్, ఎమ్మెల్యే దానం నాగేందర్, కార్పొరేటర్లు హాజరయ్యారు. మేయర్‌తో సమన్వయం చేసుకుంటూ నగర సమస్యలను పరిష్కరిస్తామని డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతారెడ్డి అన్నారు. ఉద్యమంలో పనిచేసిన విధంగానే అందుబాటులోకి ఉండి ప్రజాసమస్యల పరిష్కారంలో ముందుంటానని చెప్పారు.
అభినందనల వెల్లువ
మేయర్‌గా బాధ్యతలు చేపట్టిన గద్వాల విజయలక్ష్మికి మంత్రి కొప్పుల ఈశ్వర్ శుభాకాంక్షలు తెలిపారు. జీహెచ్ఎంసీ కార్యాలయంలో మేయర్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం హోం మంత్రి మహమూద్ ఆలీ, ఆయన కుమారుడు ఆజాం అలీ, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ దంపతులు, టీఆర్ఎస్ గ్రేటర్ మాజీ అధ్యక్షుడు కట్టెల శ్రీనివాస్ యాదవ్, కార్పొరేటర్లు మేయర్, డిప్యూటీ మేయర్లను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మేయర్‌కు జీహెచ్ఎంసీ కమిషనర్ డీఎస్ లోకేశ్ కుమార్, సీసీపీ దేవేందర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు శుభాకాంక్షలు తెలిపారు.
తాజావార్తలు
- ప్రముఖ తెలుగు రచయిత్రి పెయ్యేటి దేవి ఇకలేరు
- మార్చి 4 నుంచి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఐదో దశ పరీక్షలు
- నేడు ఎంజీఆర్ మెడికల్ వర్సిటీ స్నాతకోత్సవం.. ప్రసంగించనున్న ప్రధాని
- 60 వేల నాణెలతో అయోధ్య రామాలయం
- నానీని హగ్ చేసుకున్న ఈ బ్యూటీ మరెవరో కాదు..!
- సర్కారు పెరటి కోళ్లు.. 85 శాతం సబ్సిడీతో పిల్లలు
- కరోనా కట్టడికి నైట్ కర్ఫ్యూ
- గోమాతలకు సీమంతం.. ప్రత్యేక పూజలు
- కూతురి కళ్లెదుటే.. తండ్రిని కత్తులతో పొడిచి చంపారు
- ‘పెట్రో’ ఎఫెక్ట్.. రూ.12 పెరగనున్న పాల ధర!