మాస్కు లేకుండా రోడ్లపై తిరుగుతున్నారా.. తస్మత్ జాగ్రత్త. మిమ్మల్ని నిఘానేత్రాలు నిత్యం గమనిస్తూనే ఉన్నాయి. గస్తీలోఉండే పోలీసులు క్లిక్ అనిపిస్తూనే ఉన్నారు. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా.. బండి నంబర్‌పై రూ.వెయ్యి ఈ చలాన్ పడుతుంది. ఎక్కడైనా పోలీస్ చెకింగ్‌లో పట్టుబడితే చలాన్ మొత్తం కట్టిన తర్వాతనే బండిని వదిలిపెడుతారు. అయితే ఇది మన కోసమే అనేది మరిచిపోకండి. కరోనా కట్టడికి పోలీసులు చేస్తున్న ఓ ప్రయత్నం. నిర్లక్ష్యం వీడి విధిగా మాస్కు ధరిస్తేనే కరోనా కట్టడి సాధ్యమవుతుందనేది అందరూ గుర్తెరి నిబంధనలు పాటించాలి.