e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 16, 2021
Home హైదరాబాద్‌ మినీ శిల్పారామంలో మరాఠీ ఫుడ్‌ ఫెస్టివల్‌

మినీ శిల్పారామంలో మరాఠీ ఫుడ్‌ ఫెస్టివల్‌

మినీ శిల్పారామంలో మరాఠీ ఫుడ్‌ ఫెస్టివల్‌

రామంతాపూర్‌, మార్చి 14: ఉప్పల్‌ మినీ శిల్పారామంలో ఆదివా రం మిత్రాంగన్‌ మహా రాష్ట్రీయన్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ వారు సంయుక్త నిర్వహణలో మరాఠీ ఫు డ్‌, కల్చరల్‌ ఫెస్టివల్‌ను సైబరాబద్‌ పోలీస్‌ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ ప్రారంభించారు. ఇందులో, మీసాల పాప్‌, వడాపావ్‌, సాబుదాన్‌, వడ, కందబజి, పిట్లభక్రి, భేల్‌పూరి, సోల్‌కది, పురం పోలి, పోహె, శ్రీకండ్‌, ముత్త వంటి మహారాష్ట్ర వంటకాలు సందర్శకులకు మంచి రుచి చూపించాయి. ఇదే కాకుండా మహారాష్ట్ర సంప్రదాయ నృత్యాలు, లావాని, గోందల్‌, మార్షల్‌, ఆర్స్‌, మాల్క మ్బ్‌, మఠాఠీ పాటలు, ఎంతగానో ఆకట్టుకున్నాయి. అభంగ్‌, శివ తాండవం, లెజిన్స్‌, ప్రదర్శనలు ఆహూతులను అలరించాయి. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన కమిషర్‌ మహేశ్‌భగవత్‌ మాట్లాడుతూ దేశంలోని అన్ని రాష్ర్టాల ప్రజల సంస్కృతి, సంప్రదాయాలకు హైదరాబాద్‌ నిలయమైందన్నారు. మన సంస్కృతిని కాపాడుకోవాల్సిన అవసరముందన్నారు. శిల్పారామం వివిధ రకాల సంప్రదాయాలను, సంస్కృతిని ఇక్కడి ప్రజలకు అందించడం అభినందనీయమన్నారు. 

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
మినీ శిల్పారామంలో మరాఠీ ఫుడ్‌ ఫెస్టివల్‌

ట్రెండింగ్‌

Advertisement