బుధవారం 01 ఏప్రిల్ 2020
Hyderabad - Feb 18, 2020 , 07:40:37

పిల్లలు పుట్టడం లేదని..

పిల్లలు పుట్టడం లేదని..

హైదరాబాద్ : పిల్లలు పుట్టడంలేదని..మానసిక వేదనతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన నేరేడ్‌మెట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. సీఐ నర్సింహస్వామి కథనం ప్రకారం.. వివేకానందపురంలో నివాసం ఉంటున్న రాంపురం విజేందర్‌గౌడ్‌ (35) ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తున్నాడు.  5 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. కాగా.. పిల్లలు కలుగకపోవడంతో తీవ్ర మానసిక వేదనకు గురయ్యాడు. దీంతో సోమవారం తెల్లవారుజామున అదే కాలనీలోని రోడ్‌ నం.11లో కిరోసిన్‌ పోసుకొని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నిద్రలేచిన భార్య చూసేసరికి  భర్త కనిపించకపోవంతో అత్తా మామలకు తెలిపింది. గాలిస్తుండగా.. రోడ్డు నం.11లో  కాలిన గాయాలతో రోడ్డు పక్కన మృతి చెంది ఉన్నాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు 108లో గాంధీ  మార్చురీకి తరలించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 


logo
>>>>>>