హైదరాబాద్: జూబ్లీహిల్స్ రోడ్ నంబర్-1లో వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ సమీపంలో ఓ గుర్తు తెలియని యువకుడు ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన యువకుడిని ఉస్మానియా దవాఖానకు తరలించారు. యువకుడి ఆత్మహత్యాయత్నం ఎందుకు చేశాడనే విషయం తెలియాల్సి ఉన్నది. ఆత్మహత్యకు పాల్పడిన యువకుడు ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాకు చెందినవాడిగా పోలీసులు భావిస్తున్నారు.