శుక్రవారం 30 అక్టోబర్ 2020
Hyderabad - Jun 18, 2020 , 00:28:30

మేజర్‌ పద్మపాణి ఆచార్య తల్లి కన్నుమూత

మేజర్‌ పద్మపాణి ఆచార్య తల్లి కన్నుమూత

వనస్థలిపురం: దివంగత మేజర్‌ పద్మపాణి ఆచార్య మాతృమూర్తి విమల ఆచార్య(80) బుధవారం ఉదయం 11 గంటలకు మృతి చెందారు. కార్గిల్‌ యుద్ధంలో మేజర్‌ వీరమరణం పొందిన విషయం విదితమే. ఆమె గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇంట్లోనే ఉంటూ వైద్యం చేయించుకుంటున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. హస్తినాపురం సెంట్రల్‌ కాలనీలోని వారి నివాసంలో మృతదేహాన్ని ఉంచారు. పలువురు ప్రముఖులు, నాయకులు ఆమెకు నివాళులర్పించారు.