సోమవారం 18 జనవరి 2021
Hyderabad - Dec 02, 2020 , 06:26:35

టీఆర్‌ఎస్‌ అభ్యర్థిపై మజ్లిస్‌ నేతల దాడికి యత్నం

టీఆర్‌ఎస్‌ అభ్యర్థిపై మజ్లిస్‌ నేతల దాడికి యత్నం

  • జాంబాగ్‌ డివిజన్‌లో ఉద్రిక్తత..
  • పోలీసుల రంగప్రవేశంతో సద్దుమణిగిన గొడవ

అబిడ్స్‌ : జాంబాగ్‌ డివిజన్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఆనంద్‌గౌడ్‌పై మజ్లిస్‌ పార్టీ నేతలు దాడికి యత్నించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.  వివరాల్లోకి వెళితే... ఆగాపురా టేకీ మజీదు చార్‌కందిల్‌ ప్రాంతంలో ఉన్న పోలింగ్‌ కేంద్రాల్లో మజ్లిస్‌ పార్టీ నాయకులు రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారని సమాచారం అందుకున్న ఆనంద్‌గౌడ్‌ అక్కడికి వెళ్లారు.  అదే సమయంలో  గోషామహల్‌ నియోజకవర్గం మజ్లిస్‌ పార్టీ ఇన్‌చార్జి మీర్జా రహమత్‌ బేగ్‌ అక్కడికి చేరుకోగా..  వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నది. ఈ క్రమంలో కొందరు మజ్లిస్‌ నేతలు ఆనంద్‌గౌడ్‌పై దాడికి యత్నిస్తుండగా.. పోలీసులు వచ్చారు. వారిని అక్కడి నుంచి పంపించేశారు. దీంతో ఉద్రిక్తత సద్దుమణిగింది. కాగా... సాయంత్రం ఆరు గంటలకు పోలింగ్‌ ముగిసిన అనంతరం టీఆర్‌ఎస్‌ నాయకులు దగ్గర ఉండి పోలింగ్‌ బూత్‌లకు తాళాలు వేయించారు. అన్ని పూర్తైన అనంతరం ప్రిసైడింగ్‌ అధికారులు ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్‌ బాక్సులను సీజ్‌ చేసి.. నిజాం కళాశాలలోని స్ట్రాంగ్‌ రూమ్‌కి తరలించారు.