శుక్రవారం 23 అక్టోబర్ 2020
Hyderabad - Sep 26, 2020 , 00:41:47

నీటి సమస్యను పరిష్కరించిన ఘనత మాదే

నీటి సమస్యను పరిష్కరించిన ఘనత మాదే

ముషీరాబాద్‌ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌

ముషీరాబాద్‌: అడిక్‌మెట్‌ డివిజన్‌ పోచమ్మబస్తీ, వడ్డెర బస్తీలో తాగునీటి సమస్యను పరిష్కరించిన ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదేనని ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ అన్నారు. లో ప్రెషర్‌ నీటి సమస్య పరిష్కారానికి ఇటీవల రూ.5 లక్షలు కేటాయించి పనులు పూర్తిచేసిన సమయంలో కొంద రు చౌకబారు రాజకీయాలకు పాల్పడుతూ తామే చేసినట్లుగా హాడావుడి చేస్తున్నారని మండిపడ్డారు. శుక్రవారం ఆయన పోచమ్మ బస్తీలో  నీటి సరఫరా నియంత్రిత బూస్టర్‌ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రజల పార్టీ అని, ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో జలమండలి సంతోష్‌కుమార్‌, మేనేజర్‌ హకీం, స్థానిక కార్పొరేటర్‌ హేమలతారెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు మనోహర్‌సింగ్‌, సుధాకర్‌గుప్తా, ముఠా జైసింహ పాల్గొన్నారు. 
logo