e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 27, 2021
Home హైదరాబాద్‌ సిలిండర్‌కు కట్టేసి.. పనిముట్లతో దాడి

సిలిండర్‌కు కట్టేసి.. పనిముట్లతో దాడి

  • కార్మికులను చిత్రహింస పెట్టిన యజమాని
  • ఆభరణాల్లో స్వచ్ఛత లేదంటూ ఆరోపణ
  • ఘాన్సీబజార్‌లో దారుణం
  • దాడి చేసిన వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న యజమాని

చార్మినార్‌, జూలై 26 : ఆభరణాలు తయారు చేసేందుకు ఇచ్చిన స్వచ్ఛమైన బంగారాన్ని కల్తీ చేస్తున్నారనే ఆరోపణలపై యజమాని కార్మికులను బంధించి దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన చార్మినార్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్‌ గురు నాయుడు కథనం ప్రకారం.. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ప్రదీప్‌ జాను(29) నగరానికి వచ్చి, ఘాన్సీబజార్‌లో ఉంటున్నాడు. నగరంలోని పలు నగల షో రూంల నుంచి ఆభరణాలు తయారు చేసేందుకు ఆర్డర్లు తీసుకుంటాడు.

ఆభరణాల తయారీ కోసం ఘాన్సీ బజార్‌లో పరిశ్రమలను నెలకొల్పాడు. పరిశ్రమలో ఆభరణాలకు మెరుగులు అద్దడం కోసం పశ్చిమ బెంగాల్‌లోని వివిధ జిల్లాల నుంచి కార్మికులను నగరానికి తీసుకువచ్చాడు. వారితో ఆభరణాలకు మెరుగులద్దిస్తుంటాడు. ప్రదీప్‌ జాన్‌ వద్ద ఏడేండ్లుగా లక్ష్మీకాంత్‌ (29), సిమ్రాన్‌ మున్నా (25), ఉదయ్‌ సాంత్ర (25) పనిచేస్తున్నారు. ప్రదీప్‌ ఇటీవల లక్ష్మీకాంత్‌తోపాటు మరో ఇద్దరికి 9.16 స్వచ్ఛత కలిగిన బంగారాన్ని ఇచ్చి ఆభరణాలు చేయాలని సూచించాడు. వారం రోజుల తరువాత లక్ష్మీకాంత్‌ ఆభరణాలు చేసి ప్రదీప్‌కు అందించాడు. ఈ బంగారు ఆభరణాల్లో స్వచ్ఛత లోపించిందని ఆరోపిస్తూ ప్రదీప్‌తోపాటు రాజు, బాబులాల్‌, లాల్ట, సుజాన్‌లు కలిసి లక్ష్మీకాంత్‌, ఉదయ్‌ సాంత్ర, సిమ్రాన్‌లను వంటకు వినియోగించే సిలిండర్‌కు బంధించి దారుణంగా హింసించారు. ఆభరణాలను తయారు చేసే పనిముట్లతో దాడి చేశారు.

- Advertisement -

బాధితుల వద్ద నుంచి 12 తులాల బంగారంతోపాటు రూ.55 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. మరింత బంగారం ఇవ్వాలని దాడి చేశారు. బాధితులు స్పృహ కోల్పోయారు. ఆ తర్వాత ప్రదీప్‌, అనుచరులు కలిసి బాధితులను అక్కడి నుంచి వారి వారి గదులకు తరలించారు. స్పృహలోకి వచ్చిన బాధితులు చార్మినార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. లక్ష్మీకాంత్‌, ఉదయ్‌ సాంత్ర, మున్నాపై దాడి చేసిన రాజు, బాబులాన్‌, లాల్ట, సుజాన్‌లను అదుపులోకి తీసుకున్నామని ఇన్‌స్పెక్టర్‌ గురు నాయుడు తెలిపారు. ప్రధాన సూత్రదారి ప్రదీప్‌ పరారీలో ఉన్నాడని పేర్కొన్నారు. నిందితులపై ఐపీసీ 342 సెక్షన్‌ కింద కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలిస్తున్నామని తెలిపారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana