ఆదివారం 25 అక్టోబర్ 2020
Hyderabad - Sep 30, 2020 , 06:13:15

లాటరీ, షేర్‌మార్కెట్‌ పేరుతో రూ. 6 లక్షలు టోకరా

లాటరీ, షేర్‌మార్కెట్‌ పేరుతో  రూ. 6 లక్షలు టోకరా

లాటరీ పేరుతో ఒకరు... 

షేర్‌మార్కెట్‌ పేరుతో మరొకరు.. 

రూ. 6 లక్షలు టోకరా 

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: నాప్తల్‌ లక్కీ లాటరీ వచ్చిందంటూ నమ్మించి వారసిగూడకు చెందిన ఓ వ్యక్తికి సైబర్‌నేరగాళ్లు రూ. 6 లక్షలు టోకరా వేశారు. నాప్తల్‌ ఈ కామర్స్‌ సైట్‌ నుంచి వారసిగూడకు చెందిన బాధితుడు ఒక వస్తువును కొనుగోలు చేశాడు. కొన్నిరోజుల తరువాత తాము నాప్తల్‌ నుంచి మాట్లాడుతున్నాం.. మీకు రూ. 12 లక్షల లక్కీ లాటరీ తగిలిందని ప్రాసెసింగ్‌ చార్జీలతో మొదలుపెట్టి రూ. 6 లక్షల వరకూ వసూలు చేశారు. ఇంకా అడుగుతుండటంతో బాధితుడు మంగళవారం సీసీఎస్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేశారు. 

డిమాట్‌ అకౌంట్‌తోపాటు షేర్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టామంటూ వాట్సాప్‌లో బాధితుడికి పరిచయం అయ్యారు.  కొన్నాళ్లపాటు షేర్‌ మార్కెట్‌ గురించి చెప్పారు. అనంతరం అతడి వద్ద నుంచి పెట్టుబడిగా రూ. 2.90 లక్షలు వసూలు చేసి సెల్‌ఫోన్లు స్విచ్చాఫ్‌ చేయడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

ఓఎల్‌ఎక్స్‌లో స్కార్పియో వాహనం విక్రయ ప్రకటన చూసి ఫోన్‌ చేయగా.. పాతబస్తీకి చెందిన బాధితుడి వద్ద నుంచి కారు అమ్ముతామని నమ్మించారు, రూ. 67 వేలు కాజేశారు. ఇదిలాఉండగా వాట్సాప్‌లో గుర్తుతెలియని వ్యక్తులు అసభ్యకర వీడియోలు, అసభ్య పదజాలంతో ఇబ్బందులకు గురిచేస్తున్నారం టూ ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆయా ఫిర్యాదులపై సైబర్‌క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.logo