బుధవారం 03 జూన్ 2020
Hyderabad - May 19, 2020 , 01:51:24

ఫేస్‌బుక్‌లో పోస్టు చూసి.. రూ. 59 వేలు కొట్టేశారు

 ఫేస్‌బుక్‌లో పోస్టు చూసి.. రూ. 59 వేలు కొట్టేశారు

హైదరాబాద్ : వేర్వేరు ఘటనల్లో సైబర్‌ నేరగాళ్లు ముగ్గురికి టోకరా వేశారు.  చాదర్‌ఘాట్‌కు చెందిన   వ్యా పారి.. నాణ్యమైన మాస్కులు.. తక్కువ ధరకు ఇచ్చేవారు ఫోన్‌ చేయాలంటూ ఫేస్‌బుక్‌లో పోస్టుచేశాడు. దీన్ని  చూసిన సైబర్‌నేరగాళ్లు... అతనికి ఫోన్‌ చేసి మా స్కులు సరఫరా చేస్తామంటూ నమ్మించి, అడ్వాన్స్‌గా డబ్బులు చెల్లించాలంటూ క్యూఆర్‌ కోడ్‌ పంపి.. అతని ఖాతాలో నుంచి రూ. 59 వేలు కాజేశారు. మరో ఘటనలో ఓఎల్‌ఎక్స్‌లో ప్రకటన చూసి బైక్‌ కొందామనుకున్న యువకుడికి  సైబర్‌నేరగాళ్లు.. రూ. 39,650 టోకరా వేశారు. ఇంకో ఘటనలో రుణం ఇస్తామంటూ నమ్మించి వ్యక్తి నుంచి రూ. 12,500 సైబర్‌ క్రిమినల్స్‌ కొట్టేశారు. 

ఇదిలాఉండగా ఐటీసీ పేరుతో కొందరికి గుర్తుతెలియని వ్యక్తు లు రూ. 20 కోట్ల రుణం ఇస్తామంటూ ఈమెయిల్స్‌ పంపించారని, ఈమెయిల్స్‌ రిసీవ్‌ చేసుకున్న వ్యక్తులు ఐటీసీ సంస్థను సంప్రదించడంతో ఇదంతా మోసమని గుర్తించి, ఆ సంస్థ ప్రతినిధులు సైబర్‌ఠాణాలో ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


logo