e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, August 1, 2021
Home హైదరాబాద్‌ నాంపల్లి క్రిమినల్‌ కోర్టులో.. 6,473 కేసుల పరిష్కారం

నాంపల్లి క్రిమినల్‌ కోర్టులో.. 6,473 కేసుల పరిష్కారం

నాంపల్లి క్రిమినల్‌ కోర్టులో.. 6,473 కేసుల పరిష్కారం

సిటీ క్రిమినల్‌ కోర్టు, నాంపల్లి జూన్‌ 10(నమస్తే తెలంగాణ): జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సం స్థ ఆదేశాల మేరకు మెట్రో పాలిటన్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ ఆధ్వర్యంలో లోక్‌ అదాలత్‌ నిర్వహించారు. ఇందులో రాజీ చేసుకోదగిన క్రిమినల్‌ కేసులు, మోటారు ప్రమాద కేసులు, ఎలక్ట్రిసిటీ, గృహహింస, చెక్‌బౌన్స్‌, ప్రి లిటిగేషన్‌ కేసులను పరిష్కరించారు. రాజీయే రాజ మార్గంగా, రాజీ పడటం ఇరు వర్గాలు గెలిచినట్లుగా భావిం చి ఇరు పార్టీలు, న్యాయవాదులు పెండింగులో ఉన్న కేసులను లోక్‌ అదాలత్‌లో సామరస్యంగా పరిష్కరించుకున్నారు. భౌతిక దూరం పాటిస్తూ వర్చువల్‌ పద్ధతిన ఆన్‌లైన్‌ ద్వారా, ప్రత్యక్ష హాజ రు ద్వారా కేసులను పరిష్కరించారు.

బేగంపేట పోలీసు స్టేషన్‌ పరిధిలోని కుటుంబ తగాద కేసును పరిష్కరించారు. ప్రముఖ సినీ దర్శక నిర్మాత గుణశేఖర్‌కు సంబంధించిన రుద్రమదేవి సినిమా పైరసీ కేసు ఉపసంహరణ చేసుకున్నారు. మొత్తం 6,473 కేసులు పరిష్కరించబడ్డాయి. ఇందులో కుటుంబ తగాదాల కేసులు 53, చెక్‌బౌన్స్‌ కేసులు 288, ఎస్‌టీసీ 4,882, ప్రి లిటిగేషన్‌ కేసులు 70, క్రిమినల్‌ కేసులు 1,180 ఉన్నాయని మెట్రోసెషన్స్‌ జడ్జి, హైదరాబాద్‌ న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్‌ తుకారాంజి తెలిపారు. అలాగే, రూ.74,44,667 పరిహారాన్ని లబ్ధిదారులకు చెల్లించినట్లు తెలిపారు. కార్యక్రమంలో లోక్‌ అదాలత్‌ తెలంగాణ రాష్ట్ర లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ సభ్య కార్యదర్శి అనుపమ చక్రవర్తి, మెట్రో పాలిటన్‌ సెషన్స్‌ జడ్జి తుకారాంజి, లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ పరిపాలన అధికారి ఆంజనేయులు, హైదరాబాద్‌ కార్యదర్శి రాధాకృష్ణ చౌహాన్‌, 14వ అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జి పద్మావతి పాల్గొన్నారు.

- Advertisement -

సిటీ సివిల్‌ కోర్డు లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ ఆధ్వర్యంలో జరిగిన జాతీయ లోక్‌ అదాలత్‌లో మొత్తం 634 సివిల్‌ కేసులు పరిష్కారం అయ్యాయని సిటీ సివిల్‌ కోర్టు చీఫ్‌ జడ్జి, సిటీ సివిల్‌ కోర్డు లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ చైర్‌ పర్సన్‌ డాక్టర్‌ సి.సుమలత తెలిపారు. శనివారం సిటీ సివిల్‌ కోర్టు ఆధ్వర్యంలో జాతీయ లోక్‌ అదాలత్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 634 సివిల్‌ కేసులను పరిష్కరించడంతో పాటు మోటారు వాహన ప్రమాద బాధితులకు రూ.19,66,3008లను అందించామని, అలాగే ఇతర సివిల్‌ కేసులతో కలిపి రూ.24,23,3500లను లబ్ధిదారులకు అందించినట్లు సిటీ సివిల్‌ కోర్డు లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ చైర్‌ పర్సన్‌ డాక్టర్‌ సి. సుమలత తెలిపారు.

జీహెచ్‌ఎంసీకి చెందిన 45 కేసులను సిటీస్మాల్‌ కాజ్‌ కోర్టు ఇంచార్జి న్యాయమూర్తి నిర్మలగీతాంబ లోక్‌ అదాలత్‌లో పరిష్కరించారు. లోక్‌ అదాలత్‌కు సహకరించిన న్యాయవాదులకు ఉభయ పక్షాల కక్షిదారులకు న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్‌ సివిల్‌ జడ్జి కె.మురళి మోహన్‌ కృతజ్ఞతలు తెలిపారు. చీఫ్‌ జడ్జి డాక్టర్‌ సి.సుమలత అధ్యక్షతన జరిగిన ఈ లోక్‌ అదాలత్‌లో సిటీస్మాల్‌ కాజ్‌ కోర్టు ఇంచార్జి న్యాయమూర్తి నిర్మలగీతాంబ, సికింద్రాబాద్‌ అదనపు చీఫ్‌ జడ్జి సునీత, న్యాయమూర్తులు రమాదేవి, శ్రీదేవి, పట్టాబిరామారావు, జీవన్‌ కుమార్‌, దుర్గా ప్రసాద్‌, శ్రీవాణి, మంజజుల పాల్గొన్నారు.

రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌లో..

జాతీయ లోక్‌ అదాలత్‌ను రాచకొండ పోలీసు కమిషనర్‌ మహేశ్‌భగవత్‌ శనివారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన రంగారెడ్డి జిల్లా కోర్టును సందర్శించారు. లోక్‌ అదాలత్‌లో కేసు రాజీకి వచ్చిన వారితో సీపీ మాట్లాడారు. ఈ అదాలత్‌లో రాచకొండ పోలీసు కమిషనరేట్‌లోని 44 పీఎస్‌లకు సంబంధించి మొత్తం 2723 కేసులలో ఇరు వర్గాల వారు రాజీకి వచ్చి విచారణను ముగించుకున్నారు. ఎల్బీనగర్‌ ఇన్‌స్పెక్టర్‌ అశోక్‌రెడ్డి బృందం అత్యధికంగా 282 కేసుల్లో విచారణను పూర్తి చేసి నం.1 స్థానంలో నిలిచింది. ఈ టీమ్‌ను సీపీ అభినందించారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
నాంపల్లి క్రిమినల్‌ కోర్టులో.. 6,473 కేసుల పరిష్కారం
నాంపల్లి క్రిమినల్‌ కోర్టులో.. 6,473 కేసుల పరిష్కారం
నాంపల్లి క్రిమినల్‌ కోర్టులో.. 6,473 కేసుల పరిష్కారం

ట్రెండింగ్‌

Advertisement