శనివారం 30 మే 2020
Hyderabad - Apr 04, 2020 , 22:54:17

4 లక్షల కేసులు

4 లక్షల కేసులు

  • లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించాల్సిందే
  • ఇష్టానుసారంగా తిరిగి కేసులు తప్పవు
  • మూడు కమిషనరేట్ల సీపీల హెచ్చరిక
  • లాక్‌డౌన్‌ ఉల్లంఘనలపై మొత్తం 39,667 కేసులు,  10,500 వాహనాలు సీజ్‌
  •  ట్రాఫిక్‌ ఉల్లంఘనలపై 3,99,905 కేసులు, చలాన్లు జారీ

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ:  కరోనా నియంత్రణకు ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై నగర, రాచకొండ, సైబరాబాద్‌ పోలీసులు  కఠిన చర్యలు తీసుకుంటున్నారు. లాక్‌డౌన్‌ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటిస్తే కరోనాపై జరుగుత్ను యుద్ధంలో ఈజీగా గెలుపు మనదే అవుతుందని ప్రభుత్వం ప్రజలకు చెబుతుంది.. అయితే చాలామంది లాక్‌డౌన్‌ నిబంధనలు తప్పని సరిగా పాటిస్తున్నా.. కొందరు మాత్రం పట్టించుకోవడంలేదు. ఇష్టానుసారంగా రోడ్లపైకి వస్తున్నారు.. అలాంటి వారిపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. అలాంటి వారిపై లాక్‌డౌన్‌ నిబంధనల కింద కేసులు నమోదు చేసి వాహనాలను సీజ్‌ చేస్తున్నారు.  లాక్‌డౌన్‌ సమయంలో ఎవరూ బయటకు రావద్దని.. రోడ్డుపై వస్తే వాహనాలను సీజ్‌ చేయడంతోపాటు కేసు నమోదు చేస్తామని ముగ్గురు పోలీస్‌ కమిషనర్లు అంజనీకుమార్‌, మహేశ్‌ భగవత్‌, సజ్జనార్‌ హెచ్చరించారు.

  • హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో గత నెల 23 నుంచి ఈ నెల 3 వరకు లాక్‌డౌన్‌ నిబంధనలపై 37, 500 కేసులు నమోదు కాగా.. 8000 వాహనాలను సీజ్‌ చేశారు. అలాగే  10 రోజుల్లో 1,47,500 ట్రాఫిక్‌ ఉల్లంఘనల కేసులు, 10176 కేసులు డబుల్‌ రైడింగ్‌ కేసులు నమోదయ్యాయి. 
  • రాచకొండ పరిధిలో ఇప్పటివరకు లాక్‌డౌన్‌ ఉల్లంఘించిన 2000 మందిపై కేసులు నమోదు కాగా.. దాదాపు 1800 వాహనాలు సీజ్‌ చేశారు. ట్రాఫిక్‌ ఉల్లంఘనలపై దాదాపు 31, 757 మందిపై కేసులు నమోదయ్యాయి.  విదేశాలకు వెళ్లివచ్చిన విషయాన్ని దాచిపెట్టినందుకు 1183 మంది పాసుపోర్టులను సీజ్‌ చేశారు.
  • సైబరాబాద్‌లో లాక్‌డౌన్‌ ఉల్లంఘించిన 167 మందిపై కేసులు నమోదు కాగా... 500 వాహనాలు సీజ్‌ చేశారు. ట్రాఫిక్‌ ఉల్లంఘనలపై 2,20,648  కేసులు, చలాన్లు జారీ చేశారు.విదేశాల నుంచి వచ్చిన విషయాన్ని దాచిపెట్టి తిరుగుతున్న 928 మంది  పాసుపోర్టులను సీజ్‌ చేశారు.


logo