e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 19, 2021
Home హైదరాబాద్‌ పనులన్నీ4 గంటల్లోనే

పనులన్నీ4 గంటల్లోనే

పనులన్నీ4 గంటల్లోనే
 • నేటి నుంచి 22 వరకు నగరంలో కఠిన లాక్‌డౌన్‌
 • ఆర్టీసీ బస్సులు ఉదయం 6 నుంచి 10 లోపే
 • మెట్రో సేవలు 7 నుంచి 9.45 వరకే
 • కట్టుబడి పాటిద్దాం.. కట్టడి చేద్దాం
 • ప్రభుత్వ కార్యాలయాల్లో 33 శాతం మంది ఉద్యోగులు హాజరు

తరిమికొట్టేందుకు అందరి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించిన విషయం విదితమే. అయితే ముఖ్యమైన, అత్యవసర సేవలకు ఏ ఇబ్బందీ లేకుండా కొన్ని సడలింపులు కూడా ఇచ్చింది. ఉదయం 6 నుంచి 10 లోపు నిత్యావసర సరుకులు తెచ్చుకునే వీలు కల్పించింది. ఏ సంస్థ అయినా, ఏ కార్యాలయమైనా సరే తమ ముఖ్యమైన పనులకు ఆటంకం కలగకుండా ఆ 4 గంటలు పనిచేసుకోవచ్చు. ఈ నెల 12 నుంచి 22 వరకు అమలయ్యే లాక్‌డౌన్‌లో ప్రభుత్వం అనుమతించిన వారు తప్ప మిగిలిన వారెవరూ బయట తిరగడానికి వీళ్లేదు. కాగా లాక్‌డౌన్‌ నిర్ణయం ప్రకటించగానే మంగళవారం సాయంత్రం నగరంలోని అన్ని కిరాణా షాపుల్లో, మాల్స్‌లో విపరీతమైన రద్దీ కనిపించింది. ఇక వైన్‌షాపుల్లో మందుబాబులుచేంతాడంత క్యూలు కట్టి లైనులో నిలబడి మందు కొనుక్కున్నారు.

లాక్‌డౌన్‌ కఠినంగా అమలు చేస్తాం

లాక్‌డౌన్‌కు ప్రతి ఒక్కరు సహకరించాలి. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కేసులు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకుంటాం. సడలింపు ఇచ్చారని ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు అనవసరంగా రోడ్లపైకి రావద్దు. తప్పని సరి పరిస్థితుల్లోనే ప్రభుత్వం లాక్‌డౌన్‌ పెట్టాల్సి వచ్చిందన్న విషయం మరిచిపోవద్దు. రోడ్లపైకి రాకుండా కొన్ని రోజుల పాటు ఇంట్లోనే ఉంటే కరోనా చైన్‌ను తెగిపోతుంది. ఆ తరువాత అందరం హాయిగా తిరగొచ్చు. అన్ని జోన్లలో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశాం. సడలింపు ఉన్న వారు గుర్తింపు కార్డులు చూపితే అనుమతిస్తాం. – అంజనీకుమార్‌, హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌

ప్రతి 3 కిలో మీటర్లకు ఓ చెక్‌పోస్టు

లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘిస్తే ఎవరినీ ఉపేక్షించం. ప్రతి 3 కిలోమీటర్లకు ఓ చెక్‌ పోస్టును ఏర్పాటు చేస్తాం. సడలింపు సమయంలో ఎవరూ నిబంధనలను ఉల్లంఘించవద్దు. అపోహలు, అనుమానాలతో లాక్‌డౌన్‌ సమయంలో రోడ్లపైకి రావద్దు. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టపరంగా కఠినంగా ఉంటాం. అనుమతి ఉన్న వారే రోడ్లపై కి రావాలి. ప్రభుత్వం మినహాయింపు ఇచ్చిన వారు కచ్చితంగా ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం తమ వెంట ధృవీకరణ పత్రాలు, ఐడీ కార్డులను వెంట పెట్టుకొని ప్రయాణించాలి. వ్యాక్సినేషన్‌కు వెళ్లే వారు తమ స్లాట్‌ పత్రాలను లేదా సమాచారాన్ని చూపించాలి. – విశ్వనాథ్‌ చెన్నప్ప సజ్జనార్‌, సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌

రోడ్లపైకి వస్తే.. విపత్తుల ఉల్లంఘన చట్టం

రాచకొండ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో మొత్తం 48 చెక్‌ పోస్టులను ఏర్పాటు చేసి లాక్‌డౌన్‌ నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తాం. లాక్‌డౌన్‌ సమయంలో రోడ్లపై కి వస్తే విపత్తు నిర్వహణ చట్టాన్ని ఉల్లంఘించినందుకు కేసులను పెడతాం. సడలింపు సమయంలో కూడా
కచ్చితంగా మాస్కులు ధరించాలి. భౌతిక దూరం పాటించాలి. లేదంటే చర్యలు తప్పవు. వైద్య సేవలకు ఎలాంటి ఆడ్డంకులు ఉండవు. అందరూ సరిగ్గా 9.45 గంటల కల్లా దుకాణాలను మూసివేయాలి. –మహేశ్‌ భగవత్‌, రాచకొండ పోలీస్‌ కమిషనర్‌

ఆ 4 గంటలుఅనుమతులున్నవి

 • ఆర్టీసీ బస్సులు
 • మెట్రో రైళ్లు
 • క్యాబ్‌లు, ఆటోలు
 • మెడికల్‌ షాపులు
 • కిరాణా షాపులు
 • లాక్‌ డౌన్‌ ఉన్నప్పటికీ ఈ సేవలు నిలిచిపోవు
 • ప్రభుత్వ కార్యాలయాల్లో సేవలు
 • కరోనా వ్యాక్సినేషన్‌ (స్లాట్‌ వివరాలు చూపించాలి)
 • ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స
 • ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యం
 • గర్భవతులకు టీకాలు, ఇతర వైద్యం
 • అత్యవసర సేవలు (పోలీసుల పాసు జారీతో)
 • నగర వ్యాప్తంగా 150అన్నపూర్ణ కేంద్రాల్లో భోజనం
 • వంటగ్యాస్‌ సరఫరా
 • బ్యాంకుల్లో సేవలు
 • ఏటీఎం కేంద్రాలు
 • పెట్రోల్‌ బంకులు

లాక్‌ డౌన్‌ నుంచి వీరికి మినహాయింపు

 • ఫ్రంట్‌ లైన్‌ వర్కర్స్‌
 • కొవిడ్‌ వారియర్స్‌
 • ప్రింట్‌ మీడియా సిబ్బంది
 • ఎలక్ట్రానిక్‌ మీడియా సిబ్బంది
 • మెడికల్‌ డిస్ట్రిబ్యూటర్లు
 • ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల సిబ్బంది
 • ఇంటర్నెట్‌, బ్రాడ్‌కాస్టింగ్‌ సంస్థల సిబ్బంది
 • ఐటీ కంపెనీల సిబ్బంది
 • గ్యాస్‌ సరఫరా సిబ్బంది

సామూహిక వేడుకలు ఇలా

 • పెండ్లికి కేవలం 40 మందికి అనుమతి
 • అంత్యక్రియల్లో 20 మందికి అనుమతి

ఇవి మూసి ఉంటాయి

 • సినిమాహాళ్లు, జిమ్‌లు
 • స్విమ్మింగ్‌ ఫూల్స్‌, క్లబ్బులు
 • అమ్యూజ్‌మెంట్‌ పార్కులు
 • స్పోర్ట్స్‌ స్టేడియంలు
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
పనులన్నీ4 గంటల్లోనే

ట్రెండింగ్‌

Advertisement