e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, August 1, 2021
Home హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ టు ఔటర్‌వయా ల్యాంకోహిల్స్‌

జూబ్లీహిల్స్‌ టు ఔటర్‌వయా ల్యాంకోహిల్స్‌

జూబ్లీహిల్స్‌ టు ఔటర్‌వయా ల్యాంకోహిల్స్‌
  • ఐటీ కారిడార్‌లో మరో లింక్‌ రోడ్డు..
  • 2.35 కి.మీ.. 80నుంచి 120 అడుగుల విస్తీర్ణంలో నిర్మించేందుకు ప్రతిపాదనలు
  • లింకు రోడ్డు పూర్తయితే.. గచ్చిబౌలి, నానక్‌రాంగూడ ప్రాంతాల్లో తగ్గనున్న రద్దీ

సిటీబ్యూరో, జూలై 19 (నమస్తే తెలంగాణ) : భవిష్యత్తులో ట్రాఫిక్‌ చిక్కులు లేకుండా మెరుగైన రోడ్‌ నెట్‌ వర్క్‌ను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కార్యాచరణను రూపొందించింది. ముఖ్యంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత నగరం ఐటీ కారిడార్‌ ఉన్న పడమర దిక్కునే శరవేగంగా విస్తరిస్తున్నది. దీంతో ఈ ప్రాంతానికి వెళ్లాలంటే ప్రధాన రహదారులు తప్ప.. ప్రత్యామ్నాయ రహదారులు అందుబాటులో లేకుండా పోయాయి. ముఖ్యంగా మాదాపూర్‌ హైటెక్‌ సిటీ తర్వాత అత్యధికంగా ఐటీ ఉద్యోగులు పనిచేసే గచ్చిబౌలి ఫైనాన్సియల్‌ డిస్ట్రిక్ట్‌, నానక్‌రాంగూడ, కోకాపేట ప్రాంతాలకు వెళ్లాలంటే షేక్‌పేట, రాయదుర్గం మీదుగా గచ్చిబౌలి వరకు పాత ముంబై హైవే వెంబడే ప్రయాణం చేయాల్సి వస్తున్నది.

దీంతో నిత్యం ట్రాఫిక్‌ సమస్యలు, దూర భారం వంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇది గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం గచ్చిబౌలి ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ను కలిపేలా జూబ్లీహిల్స్‌ నుంచి నేరుగా ల్యాంకోహిల్స్‌ మీదుగా ఔటర్‌ రింగురోడ్డు వరకు లింకురోడ్డు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (హెచ్‌ఎండీఏ), గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) పరిధిలోని హైదరాబాద్‌ రోడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ సుమారు 2.35 కిలోమీటర్ల మేర కొత్తగా లింకు రోడ్డును నిర్మించేందుకు ప్రతిపాదనలు రూపొందించాయి.

మల్కంచెరువు పక్కనుంచే..

- Advertisement -

నగరానికి పడమర దిక్కున పలు ప్రాంతాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. మాదాపూర్‌, రాయదుర్గం ప్రాంతాల్లోని ఐటీ కంపెనీలకు సమీపంలో ఉన్న మణికొండ, నార్సింగి, పుప్పాల్‌గూడ, నెక్నంపూర్‌ ప్రాంతాల్లో కొత్తగా నివాస గృహాలు పెద్ద మొత్తంలో నిర్మాణంలో ఉన్నాయి. వీటికి తోడు ల్యాంకో హిల్స్‌, చిత్రపురి కాలనీల్లో సైతం నివాసముండే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. దీంతో ఈ ప్రాంతాలన్నింటినీ కలిపేలా 80 అడుగుల నుంచి 120 అడుగుల వెడల్పుతో నిర్మించేలా ప్రతిపాదనలు రూపొందించారు.

ఇప్పటికే రాయదుర్గం మల్కచెరువు వద్ద జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 70, 45లను కలుపుతూ లింకు రోడ్డును నిర్మించి ప్రారంభించారు. దీనికి కొనసాగింపుగా మల్కంచెరువు పక్క నుంచి మణికొండ జాగీర్‌, చిత్రపురి కాలనీ, ల్యాంకోహిల్స్‌ మీదుగా ఔటర్‌ రింగు రోడ్డుపై నానక్‌రాంగూడ వద్ద ఉన్న టోల్‌ప్లాజా వరకు కొత్త లింకు రోడ్డును ప్రతిపాదించారు. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే.. గచ్చిబౌలి, నానక్‌రాంగూడ ప్రాంతాల్లోని ప్రధాన రహదారిపై ట్రాఫిక్‌ రద్దీ తగ్గుతుంది. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 45 నుంచి నేరుగా ఔటర్‌ రింగురోడ్డు, గచ్చిబౌలి డిస్ట్రిక్ట్‌, కోకాపేట ప్రాంతాలకు చేరుకోవచ్చు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
జూబ్లీహిల్స్‌ టు ఔటర్‌వయా ల్యాంకోహిల్స్‌
జూబ్లీహిల్స్‌ టు ఔటర్‌వయా ల్యాంకోహిల్స్‌
జూబ్లీహిల్స్‌ టు ఔటర్‌వయా ల్యాంకోహిల్స్‌

ట్రెండింగ్‌

Advertisement