నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన 106వ సినిమాగా బోయపాటి శీను దర్శకత్వంలో ఓ మాస్ ఎంటర్టైనర్ చేస్తున్న విషయం తెలిసిందే. సింహా, లెజెండ్ చిత్రాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ మూవీపై అభిమానులలో భారీ అంచనాలు ఉన్నాయి. చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ కథానాయికగా నటించింది. మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ బాణీలు కడుతున్నారు.
ఈ చిత్రంలో బాలయ్య మీకోవర్ సరికొత్తగా ఉంటుంది. అఘోరాగా కనిపిస్తాడని కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతుంది. మే 28న విడుదల కానున్న ఈ సినిమా టైటిల్ కోసం అభిమానులు కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు మోనార్క్ అనే టైటిల్‌తో ఈ చిత్రం ప్రచారం జరుగుతుండగా, ఒరిజినల్ టైటిల్‌ని ఏప్రిల్ 13 మధ్యాహ్నాం 12.33ని.లకు రివీల్ చేయనున్నారట. ఆ రోజు బాలకృష్ణ అభిమానులకు రెండు పండుగలు వస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.