న్యూఢిల్లీ, మే 31: హై క్వాలిటీ ఫొటోలకు సంబంధించి గూగుల్ ఫొటోస్లో ఇకపై అపరిమిత స్టోరేజీకి అవకాశం ఉండదు. ఫొటోల స్టోరేజీ 15జీబీ దాటితే చార్జీ విధించాలన్న గూగుల్ నిర్ణయం నేటి నుంచి(జూన్ 1) అమల్లోకి వచ్చింది. అయితే ఇప్పటివరకు గూగుల్ ఫొటోస్ ఖాతాలో ఉన్న ఫొటోలకు ఈ పరిమితి వర్తించదు. ఇక నుంచి స్టోర్ చేసేవాటికే చార్జీ నిబంధన వర్తిస్తుంది. చార్జీలు వద్దనుకొంటే పిక్చర్ క్వాలిటీ ఆప్షన్ను మార్చుకోవడానికి గూగుల్ వెసులుబాటు కల్పించింది. గూగుల్ ఫొటోస్లో 15జీబీ కంటే ఎక్కువ స్టోరేజీ కావాలనుకొనే వారికి ప్లాన్లు ప్రకటించింది.