ఎర్రలైటు పడితే ఆగాలి.. గ్రీన్ పడ్డాకే కదలాలి

- ఎక్కడంటే అక్కడ రోడ్డు దాటొద్దు..
- రోడ్ సెఫ్టీపై పిల్లలకు పాఠాలు
- బాల్య దశ నుంచే అవగాహన
- రోడ్డు ప్రమాదాల నివారణకు సర్కారు ప్రయత్నం
‘విద్యార్థులు ఎక్కడంటే అక్కడ రోడ్లు దాటకూడదు. తప్పనిసరిగా జీబ్రా క్రాసింగ్ ఉన్న చోటే దాటాలి. సిటీ బస్సుల్లో వెళ్లేటప్పుడు బస్సు పూర్తిగా ఆగిన తర్వాతే ఎక్కడం లేదా దిగడం చేయాలి.’ ఎర్ర లైటు పడితే ఆగాలి.. గ్రీన్లైటు పడితే కదలాలి’.. ఇలా ప్రాథమిక పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు రోడ్డు భద్రతపై పాఠాల ద్వారా అవగాహన కల్పిస్తున్నది ప్రభుత్వం. ‘నిబంధనలు పాటిస్తే.. ప్రమాదాలు దూరం’ అంటూ..బాల్య దశ నుంచే విజ్ఞాన జ్యోతులను వెలిగించి.. రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేస్తున్నది.
చక్కగా అవగాహన కల్పించే ప్రయత్నం..
హైదరాబాద్ బస్ స్టేషన్ నుంచి రవిప్రకాశ్, వేణుగోపాల్ ఇద్దరూ ఆటోలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు బయలుదేరారు. దారిలో ఎర్రలైటు వెలిగినప్పుడు ఆటో ఆగడం, ఆరెంజ్ లైటు వెలిగినప్పుడు ఆటో స్టార్ట్ చేయడం, ఆకుపచ్చ లైటు వెలిగినప్పుడు మందుకు పోవడం రవిప్రకాశ్ గమనించాడు. ఆటో ఆగినప్పుడు రోడ్డుపై గీసిన తెల్లటి చారలపై నుంచి మాత్రమే మనుషులు రోడ్డుకు ఒక దిక్కు నుంచి మరో దిక్కుకు వెళ్లడం, తెల్ల షర్టు వేసుకున్న పోలీసు అందరికీ సహాయం చేయడం గమనించాడు. ఆ తెల్లటి చారలను జీబ్రా క్రాసింగ్ అంటారని, జీబ్రా క్రాసింగ్ మీద పాదచారులు రోడ్డు దాటుతుంటారని తెలుసుకున్నాడు. రాష్ట్ర సర్కారు ముద్రించిన మూడోతరగతి పరిసరాల విజ్ఞానం పుస్తకంలోని పాఠ్యాంశమిది. ఈ పాఠ్యాంశం ద్వారా ట్రాఫిక్ సిగ్నల్స్ లేకపోతే ఏమవుతుంది? గ్రామాల్లో ట్రాఫిక్ సిగ్నల్స్ ఎందుకు ఉండవు? ట్రాఫిక్ జామ్ ఎందుకవుతుంది? రోడ్డుపైన వెళ్లేటప్పుడు పాటించాల్సిన నియమాలేమిటి? ఇలాంటి విషయాలను విద్యార్థులకు చక్కగా అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు.
ఎలాంటి భద్రత పాటించాలి..
ఏయే సందర్భాల్లో ఎక్కడ ఎలాంటి భద్రత పాటించాలన్న విషయాన్ని విద్యార్థులకు వివరించేందుకు ఐదో తరగతి పరిసరాల విజ్ఞానంలో విద్యార్థులకు కథ రూపంలో అవగాహన కల్పించారు. ప్రయాణానికి బయలుదేరినప్పుడు ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? భద్రతా చర్యలు ఎప్పుడు, ఎక్కడ తీసుకోవాలి? వంటి అంశాలను వివరించారు.
అప్రమత్తతతోనే..
రోడ్డు భద్రతపై ఎవరు ఎన్ని రకాలుగా వివరించినా.. ఎవరికి వారు అప్రమత్తత పాటించడం వల్ల ప్రమాదాలను నివారించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మూడో తరగతి స్థాయి నుంచి విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నది. రోడ్డు నిబంధనలు, ఆయా వాహనాల్లో వెళ్లే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రోడ్లు దాటేటప్పుడు పాటించాల్సిన విధానాలు వంటివి పాఠ్యాంశాల ద్వారా వివరిస్తుండటం విశేషం.
తాజావార్తలు
- మిషన్ భగీరథ భేష్ : కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి
- ఆన్లైన్లోనే నామినేషన్లు వేయొచ్చు!
- భాగ్యశ్రీ అందానికి ఫిదా అవ్వాల్సిందే..వీడియో
- పంజాబ్‌లో కనిపించిన యూఎఫ్‌వో.. వీడియో వైరల్
- గుర్తు తెలియని వాహనం ఢీకొని.. ఇద్దరు యువకులు మృతి
- ఫైజర్ వ్యాక్సిన్ సింగిల్ డోస్‌తో వైరస్ సంక్రమణకు చెక్!
- ఐదు రాష్ట్రాల ఎన్నికలు: గంటసేపు పొలింగ్ పొడిగింపు
- సీఆర్పీఎఫ్ జవాన్లకు సైనిక హెలికాప్టర్ సదుపాయం
- ఫిబ్రవరి 13ను వివేకానంద డే గా గుర్తించాలి..
- 4 రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతానికి ఎన్నికల షెడ్యూల్ విడుదల