HomeHyderabadLast Ride Service Rolls Out In Cyberabad
సైబరాబాద్ పరిధిలో ఉచితంగా లాస్ట్ రైడ్ సేవలు..
కరోనా మహమ్మారితో మృతి చెందిన వారి అంత్యక్రియలను లాస్ట్‌రైడ్ సేవకులు స్వచ్ఛందంగా నిర్వహిస్తారని.. ఎవరైనా ఈ సేవలను ప్రతిరోజు ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉచితంగానే పొందవచ్చని సీపీ సజ్జనార్ అన్నారు.
సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో మాత్రమే సాగే లాస్ట్‌రైడ్ సేవలను సోమవారం గచ్చిబౌలి పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సీపీ ప్రారంభించారు.
ఈ సేవలు కావాల్సిన వారు 7995404040 లేదా సైబరాబాద్ కొవిడ్ కంట్రోల్ నంబర్ 9490617440లో సంప్రదించవచ్చన్నారు.
కార్యక్రమంలో ట్రాఫిక్ డీసీపీ ఎస్ఎమ్.విజయ్‌కుమార్, ఎస్సీఎస్సీ ప్రధాన కార్యదర్శి కృష్ణ ఏదుల, పోలీసు ఉన్నతాధికారులు, లాస్ట్ రైడ్ సంస్థ సేవకులు పాల్గొన్నారు.