బుధవారం 02 డిసెంబర్ 2020
Hyderabad - Oct 30, 2020 , 07:33:01

కార్మిక నాయకుడు ఎస్‌బీ మోహన్‌రెడ్డి కన్నుమూత

కార్మిక నాయకుడు ఎస్‌బీ మోహన్‌రెడ్డి కన్నుమూత

చిక్కడపల్లి : కార్మిక నాయకుడు, మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ముఖ్య సహచరుడు ఎస్‌.బీ మోహన్‌రెడ్డి(78) గురువారం తెల్లవారుజామున మరణించారు. ఆరునెలల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న మోహన్‌ రెడ్డి ఆరోగ్యం విషమించగా  ఆంధ్రమహిళా సభ దవాఖానలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. వీఎస్‌టీ కంపెనీలో నాయిని అధ్యక్షుడిగా ఉండగా మోహన్‌ రెడ్డి 8 సంవత్సరాల పాటు ప్రధాన కార్యదర్శిగా పని చేసి మంచి నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన హయాంలో సుమారు 700 మందికి పైగా కొత్తవారికి ఉద్యోగం ఇప్పించారు. మోహన్‌రెడ్డికి భార్య, ఒక కుమారుడు ఉన్నారు. ఆయన భౌతిక కాయానికి ఎమ్మెల్యే ముఠా గోపాల్‌, కొల్లపూర్‌ ఎమ్మెల్యే హర్షవర్ధన్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కోదండరెడ్డి, మాజీ కార్పొరేటర్‌  రావి వెంకట్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు, వీఎస్‌టీ కార్మికులు నివాళుర్పించారు.