శుక్రవారం 23 అక్టోబర్ 2020
Hyderabad - Sep 21, 2020 , 00:39:24

కేవైసీ అప్‌డేట్‌ అంటూ ఎర..

కేవైసీ అప్‌డేట్‌ అంటూ ఎర..

యాప్‌లను డౌన్‌లోడ్‌ చేయించి..

ఖాతాలు కొల్లగొడుతున్న సైబర్‌ దొంగలు

అప్రమత్తంగా ఉండాలంటున్న సైబర్‌ క్రైం పోలీసులు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: పేటీఎం కేవైసీ అప్‌డేట్‌ అంటూ ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్‌ చేస్తున్నారా..అయితే అలాంటివారిపై అప్రమత్తంగా ఉండాలని రాచకొండ సైబర్‌ క్రైం పోలీసులు సూచిస్తున్నారు.. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. మీ బ్యాంకు ఖాతాలు ఖాళీ అవుతాయని, అలాగే కేవైసీ అప్‌డేట్‌ పేరుతో గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్‌ చేసి క్విక్‌ సపోర్టు, టీమ్‌ వ్యూవర్‌, ఎనీడెస్క్‌ యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకోమంటే అసలు చేసుకోవద్దని తెలిపారు. అలాగే.. పేటీఎం కేవైసీని అప్‌డేట్‌ చేసుకోకపోతే.. 24 గంటల్లో  మీ సేవలు నిలిచిపోతాయని... కొనసాగాలంటే మేం పంపించే లింక్‌ను క్లిక్‌ చేయండని అని  మెసేజ్‌ వచ్చినా అందులోని లింక్‌లను అసలు క్లిక్‌ చేయొద్దని సైబర్‌ క్రైం ఏసీపీ హరినాథ్‌ సూచించారు. వీటిపై ప్రజలను అప్రమత్తం చేయడానికి  సైబర్‌ దొంగల మోసాలపై పోస్టర్లను ము ద్రించి రద్దీ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ప్రజలు కూడా గుడ్డిగా గుర్తు తెలియని వ్యక్తుల మాటలు నమ్మొద్దన్నారు. యూపీఐ యాప్‌లకు కేవైసీ అప్‌డేట్‌ అవసరం లేదని, ఈ యాప్‌లను అవసరం అనుకుంటే స్మా ర్ట్‌ఫోన్‌లలో పెట్టుకోవచ్చు.. లేదంటే డిలీట్‌ చేసుకోవచ్చని ఏసీపీ సూచించారు. 

logo