మంగళవారం 26 మే 2020
Hyderabad - May 23, 2020 , 01:22:52

కేటీఆర్‌ ఆదేశంతో కార్పొరేటర్‌కు జరిమానా

కేటీఆర్‌ ఆదేశంతో కార్పొరేటర్‌కు జరిమానా

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: అది సామాన్యులైనా.. ప్రజాప్రతినిధులైనా.. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని చెప్పే పాఠమిది. సుల్తాన్‌నగర్‌ బస్తీదవాఖాన ప్రారంభోత్సవానికి మంత్రి కేటీఆర్‌ హాజరైన సందర్భంగా ఎర్రగడ్డ కార్పొరేటర్‌ షాహీన్‌బేగం పరిసరాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించారు. శుక్రవారం మధ్యాహ్నం అక్కడికి వచ్చిన మంత్రి కేటీఆర్‌ వీటిని గమనించారు. ఫ్లెక్సీలు పెట్టినందుకు కార్పొరేటర్‌కు, మాస్క్‌ ధరించని మాజీ కార్పొరేటర్‌ మహ్మద్‌ షరీఫ్‌కు జరిమానా వేయాల్సిందిగా బల్దియా అధికారులను ఆదేశించారు. కార్పొరేటర్‌కు అధికారులు రూ.20వేలు, మాజీ కార్పొరేటర్‌కు రూ.1000 జరిమానా వేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే.. ఎవరికైనా చర్యలు తప్పవనే సందేశమిచ్చారు.


logo