మంగళవారం 27 అక్టోబర్ 2020
Hyderabad - Sep 23, 2020 , 00:33:33

అక్టోబర్‌లో కేటీఆర్‌ ఫుట్‌బాల్‌ చాంపియన్‌షిప్‌

అక్టోబర్‌లో  కేటీఆర్‌ ఫుట్‌బాల్‌ చాంపియన్‌షిప్‌

అబిడ్స్‌, మెహిదీపట్నం : కరోనా కష్టకాలంలో అవస్థలు పడుతున్న ఫుట్‌బాల్‌ క్రీడాకారులను ఆదుకోవడానికి అక్టోబర్‌ నెలలో మొదటి కేటీఆర్‌ ఫుట్‌బాల్‌ చాంపియన్‌షిప్‌ టోర్నమెంట్‌ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకుడు మన్నాన్‌ తెలిపారు. ఈ మేరకు క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మంగళవారం ఉప్పల్‌ టీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి బద్రుద్దీన్‌తో కలిసి ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌ నిర్వహణకు ప్రభుత్వ సహాయ సహకారాలు అందించాలని కోరినట్లు తెలిపారు. కొవిడ్‌ కారణంగా క్రీడాకారుల ఆర్థిక పరిస్థితులు, వారిలో దాగున్న నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు ఈ చాంపియన్‌షిప్‌ పోటీలను నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు.  ఆసక్తి గల ఫుట్‌బాల్‌ టీం 8374315052 నంబర్‌లో సంప్రదించాలని కోరారు. 


logo