e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 20, 2021
Home News Double Bed Room |మ‌ల‌క్‌పేటలో రేపు 288 డ‌బుల్ బెడ్రూం ఇండ్లు ప్రారంభం..

Double Bed Room |మ‌ల‌క్‌పేటలో రేపు 288 డ‌బుల్ బెడ్రూం ఇండ్లు ప్రారంభం..

హైద‌రాబాద్ : మ‌ల‌క్‌పేట నియోజ‌క‌వ‌ర్గంలోని పిల్లిగుడిసెలు బ‌స్తీలో నూత‌నంగా నిర్మించిన 288 డ‌బుల్ బెడ్రూం ఇండ్ల‌ను రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ శ‌నివారం ప్రారంభించ‌నున్నారు. ఈ ఇండ్ల‌ను తొమ్మిది అంత‌స్తుల్లో రూ. 24.91 కోట్ల వ్య‌యంతో నిర్మించారు.

హైద‌రాబాద్ న‌గ‌రాన్ని స్ల‌మ్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటున్న విష‌యం విదిత‌మే. ఈ క్ర‌మంలో మురికివాడ‌గా ఉన్న పిల్లిగుడిసెలు బ‌స్తీలో ఇప్పుడు డ‌బుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి.. ఆ ప్రాంతానికి కొత్త అందాన్ని తెచ్చారు. ఈ కాల‌నీలో కొత్త‌గా సీసీ రోడ్లు వేశారు. తాగునీటి అవ‌స‌రాల కోసం 100 కేఎల్ సామ‌ర్థ్యంతో సంప్‌ను నిర్మించారు. 19 షాపుల‌ను ఏర్పాటు చేశారు.

- Advertisement -

డ‌బుల్ బెడ్రూం ఇండ్ల ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మంలో మంత్రులు కేటీఆర్, మ‌హ‌ముద్ అలీ, ప్ర‌శాంత్ రెడ్డి, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్, హైద‌రాబాద్ ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీతో పాటు ప‌లువురు పాల్గొన‌నున్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana