గురువారం 01 అక్టోబర్ 2020
Hyderabad - Aug 11, 2020 , 23:49:11

కృష్ణస్వామి సేవలు శ్లాఘనీయం

కృష్ణస్వామి సేవలు శ్లాఘనీయం

అంబర్‌పేట: హైదరాబాద్‌ నగర మాజీ మేయర్‌, దివంగత కృష్ణస్వామి ముదిరాజ్‌ సేవలు శ్లాఘనీయమని అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌ అన్నారు. మంగళవారం అంబర్‌పేటలోని తెలంగాణ ముదిరాజ్‌ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యాలయ ఆవరణలో కృష్ణస్వామి జయంతిని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పుట్టి యాదగిరిముదిరాజ్‌ ఆధ్వర్యంలో జరిపారు. ఎమ్మెల్యే వెంకటేశ్‌ ముఖ్యఅతిథిగా హాజరై కృష్ణస్వామి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సంఘం ప్రతినిధులు తూర్పు రాంచందర్‌, సి.నవీన్‌ముదిరాజ్‌, ఉపాధ్యక్షుడు ఎం.సతీశ్‌ముదిరాజ్‌, అంజయ్య, కొరివి లక్ష్మణ్‌, వి.బాలరాజ్‌, కావలి అనంతయ్య, రాష్ట్ర యూత్‌ అధ్యక్షుడు యువ ప్రవీణ్‌ముదిరాజ్‌, ప్రధాన కార్యదర్శి సిద్ధార్థ్‌ ముదిరాజ్‌ పాల్గొన్నారు.

శంకేశ్వర బజార్‌లో కృష్ణస్వామి విగ్రహావిష్కరణ

సైదాబాద్‌: కృష్ణస్వామి సేవలు శ్లాఘనీయమని శంకేశ్వరబజార్‌ ముదిరాజ్‌ సంఘం అధ్యక్షుడు రమణాకర్‌ముదిరాజ్‌ అన్నారు. ప్రజలందరూ  కృష్ణస్వామి సేవలు గుర్తుంచుకుంటారని కార్పొరేటర్లు పేర్కొన్నారు.  సంఘం ఆధ్వర్యంలో మంగళవారం సరూర్‌నగర్‌ చెరువు శంకేశ్వర బజార్‌ చౌరస్తాలో కృష్ణస్వామి విగ్రహాన్ని ఐఎస్‌సదన్‌, సైదాబాద్‌, గడ్డి అన్నారం డివిజన్ల కార్పొరేటర్లు సామ స్వప్న, సింగిరెడ్డి స్వర్ణలత, భవానీ ప్రవీణ్‌కుమార్‌  ఆవిష్కరించారు. సంఘం ఉపాధ్యక్షుడు వెంకటేశ్‌, శంకర్‌, కోశాధికారి దర్శన్‌, జి.రాజాపతి, రమేశ్‌, సత్యనారాయణ, రఘుపతి, పరమేశ్‌, రాంరెడ్డి, అర్జున్‌, జగదీశ్‌, ప్రకాశ్‌ పాల్గొన్నారు.


తాజావార్తలు


logo