బుధవారం 30 సెప్టెంబర్ 2020
Hyderabad - Aug 12, 2020 , 00:39:57

ఇండ్లలోనే కృష్ణాష్టమి

ఇండ్లలోనే కృష్ణాష్టమి

అలరించిన రాధాకృష్ణులు

నల్లని వాడు, అల్లరివాడు, యశోద తనయుడు,గోపికాలోలుడిగా పేరున్న శ్రీకృష్ణుడి జన్మాష్టమి వేడుకలు మంగళవారం గ్రేటర్‌ వ్యాప్తంగా నిరాడంబరంగా జరిగాయి. కరోనా నేపథ్యంలో ఈ వేడుకలు ఇంటికే పరిమితం అయ్యాయి. స్కూల్స్‌ మూతపడడంతో తల్లిదండ్రులు ఇంట్లోనే చిన్నారులకు రాధాకృష్ణుల వేషధారణ వేయగా వారు అందరినీ అలరించారు. పలు చోట్ల శ్రీకృష్ణుడి ఆలయాల్లో, గోషాలలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.కృష్ణుడికి ఇష్టమైన పాలు, పెరుగు, వెన్నె తదితర పదార్థాలతో అభిషేకం, అర్చనలు చేశారు. అనంతరం నైవేద్యం సమర్పించారు. 

 -సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ 


తాజావార్తలు


logo