నల్లగొండ : జిల్లాలోని నాగార్జునసాగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే నోముల భగత్ సోమవారం నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా గుత్తా వెంకట్రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పెద్దవూర మండల పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అదేవిధంగా నాగార్జునసాగర్ కమలా నెహ్రూ ఏరియా ఆస్పత్రిలో కరోనా రోగులకు పౌష్టికాహార కిట్లను పంపిణీ చేశారు.