e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 17, 2021
Home క్రైమ్‌ బాలికను కిడ్నాప్‌ చేసిన యువకుడు అరెస్టు

బాలికను కిడ్నాప్‌ చేసిన యువకుడు అరెస్టు

బాలికను కిడ్నాప్‌ చేసిన యువకుడు అరెస్టు

చర్లపల్లి, ఏప్రిల్‌ 27 : పెండ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి ఓ మైనర్‌ బాలికను కిడ్పాప్‌ చేసిన ఘటనలో నిందితుడిని అరెస్టు చేసిన ఘటన కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పంజాబ్‌ రాష్ట్రం, దార్‌బస్తీ మండలం, కురువాలా గ్రామానికి చెందిన సోనుకుమార్‌ ఠాకూర్‌(19) బతుకుదెరువు కోసం మల్లాపూర్‌ డివిజన్‌ పరిధిలోని అశోక్‌నగర్‌కు వచ్చి స్థానికంగా బార్బర్‌గా పనిచేస్తున్నాడు. కాగా గత నెల 3న అదే ప్రాంతంలో నివాసముండే మైనర్‌ బాలిక(16)ను మాయమాటలు చెప్పి బాలికను పంజాబ్‌, బీహార్‌, నేపాల తదితర ప్రాంతాలకు తీసుకువెళ్లి పెండ్లి చెసుకున్నాడు. బాలిక అదృశ్యమైనట్లు గమనించిన బాలిక కుటుంబ సభ్యులు తెలిసిన వారి వద్ద, బంధువుల వద్ద వాకబు చేసిన ఫలితం లేకపోవడంతో వెంటనే పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకొని పోలీసులు బాలిక, నిందితుడు ఉన్న ప్రాంతాన్ని గుర్తించి అరెస్టు చేశారు. నిందితుడిపై అత్యాచారం, కిడ్నాప్‌ కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
బాలికను కిడ్నాప్‌ చేసిన యువకుడు అరెస్టు

ట్రెండింగ్‌

Advertisement