బుధవారం 08 జూలై 2020
Hyderabad - Jun 01, 2020 , 01:57:03

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.. మేయర్‌

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.. మేయర్‌

హైదరాబాద్ ‌: రాష్ట్ర మున్సిపల్‌, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పిలుపు మేరకు ఆదివారం నౌబత్‌ పహాడ్‌లోజీహెచ్‌ఎంసీ ఎంటమాలజీ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎగ్జిబిషన్‌లో ఏర్పాటు చేసిన టైర్లు, కొబ్బరి చిప్పలు, మట్టి పెంకులు, డబ్బాలు తదితర వాటిని ప్రదర్శించడం,  అందులో పురుగులు నిలవడం వాటిని ప్రదర్శించి ప్రజల్లో అవగాహన కల్పించారు. అనంతరం మేయర్‌ బొంతు రామ్మోహన్‌ గన్‌ఫౌండ్రి కార్పొరేటర్‌, జీహెచ్‌ఎంసీ స్టాండింగ్‌ కమిటీ సభ్యురాలు మమతా సంతోష్‌గుప్తాతో కలిసి బస్తీలోని ఇంటింటికీ పర్యటించి సమస్యలు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజల నివాసాల్లోని డ్రమ్ముల్లో రసాయనాలు వేశారు. అనంతరం మేయర్‌  మాట్లాడారు. ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే రోగాలు దరి చేరవన్నారు.   గన్‌ఫౌండ్రి కార్పొరేటర్‌, జీహెచ్‌ఎంసీ స్టాండింగ్‌ కమిటీ సభ్యురాలు మమతా సంతోష్‌గుప్తా మాట్లాడుతూ రాష్ట్ర మున్సిపల్‌, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పిలుపు మేరకు ఆదివారం పది నిమిషాల కార్యక్రమాన్ని తమ డివిజన్‌లో ఏర్పాటు చేయడంపై సంతోషం వ్యక్తం చేశారు.  కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ ఖైరతాబాద్‌ జోనల్‌ కమిషనర్‌ ప్రావిణ్య, సీనియర్‌ ఎంటమాలజిస్ట్‌ రాంబాబు, టీఆర్‌ఎస్‌ నాయకులు సంతోష్‌గుప్తా, నౌబత్‌ పహాడ్‌ కాలనీ  అధ్యక్షుడు అనిల్‌  పాల్గొన్నారు. 

వాహనాలను సమకూర్చడం అభినందనీయం  

  కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా గన్‌ఫౌండ్రి కార్పొరేటర్‌ మమతా సంతోష్‌ గుప్తా సొంతంగా రసాయనాలను పిచికారీ చేసే వాహనాలతో పాటు నాలుగు మిషన్లను ఏర్పాటు చేయడం అభినందనీయమని జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ తెలిపారు. గన్‌ఫౌండ్రి కార్పొరేటర్‌ మమతా సంతోష్‌ గుప్తా నివాసం వద్ద వాహనాలను ఆయన  ప్రారంభించారు.   కార్పొరేటర్‌  ప్రత్యేకంగా తయారు చేయించిన మామిడి పచ్చడి బాటిళ్లను మేయర్‌ పలువురు స్థానికులకు అందజేశారు. అనంతరం నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు సంతోష్‌ గుప్తా, కార్యకర్తలు, తదితరులు  పాల్గొన్నారు.  logo