మంగళవారం 01 డిసెంబర్ 2020
Hyderabad - Oct 27, 2020 , 07:29:17

కథక్‌ కళాక్షేత్ర ప్రారంభం.. శుభ సూచకం

కథక్‌ కళాక్షేత్ర ప్రారంభం.. శుభ సూచకం

ప్రముఖ సామాజికవేత్త మనాలి ఠాకూర్‌

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : విజయదశమిని పురస్కరించుకొని కథక్‌ కళాక్షేత్రాన్ని ప్రారంభించడం శుభపరిణామమని ప్రముఖ సామాజికవేత్త మనాలి ఠాకూర్‌ అన్నారు. కేంద్ర సెన్సార్‌ బోర్డు సభ్యులు, ప్రముఖ నాట్యాచార్యులు పండిట్‌ అంజుబాబు టోలిచౌకీ - సబ్జానగర్‌లో ఏర్పాటు చేసిన కథక్‌ కళాక్షేత్రాన్ని మనాలి ఠాకూర్‌ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా క్లిష్ట సమయంలో ఇప్పుడిప్పుడే జనం మళ్లీ బయటకు వస్తున్నారని, శాస్త్రీయ నృత్యం నేర్చుకోవడంతో వ్యాయామంతోపాటు జ్ఞాపకశక్తి పెరుగుతుందన్నారు. మనసుకు ఆహ్లాదం కలిగిస్తుందన్నారు. ఈ సందర్భంగా అక్షిత, ఇషిత ప్రత్యేకంగా కథక్‌ నృత్యాంశాలు ప్రదర్శించి అలరించారు. కార్యక్రమంలో డాక్టర్‌ చిల్లా రాజశేఖర్‌ రెడ్డి, డాక్టర్‌ మహ్మద్‌ రఫీ, లయన్‌ వైకే నాగేశ్వర్‌ రావు, చేరాల నారాయణ, తెలంగాణ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ సెక్రటరీ సైదులు, లయన్‌ ఎం.ఏ.హమీద్‌, లయన్‌ వీవీ రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.